విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మించిన సిరిస్ 'దూత'. సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో నాగ చైతన్య అక్కినేని ప్రధాన పాత్ర పోషించారు. పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్, ప్రాచీ దేశాయ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లోని ప్రైమ్ మెంబర్స్ కు డిసెంబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో సిరీస్‌లోని మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లు ప్రసారం కానున్నాయి.
దూత ట్రెయిలర్ ను ఇక్కడ చూడండి: https://youtu.be/-ITBFd_K5_M
ఈ సిరిస్ కు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మించారు. 'ధూత' నాగ చైతన్య అక్కినేని నటిస్తున్న తొలి వెబ్ సిరిస్. ఎనిమిది ఎపిసోడ్‌ల సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. దూత ప్రత్యేకంగా భారతదేశంలోని ప్రైమ్ వీడియోలో, ప్రపంచవ్యాప్తంగా 240 కంటే ఎక్కువ దేశాలులో డిసెంబర్ 1న ప్రసారం కానుంది. దూత ప్రైమ్ మెంబర్‌షిప్‌కి లేటెస్ట్ ఎడిషన్. ఇండియాలో ప్రైమ్ మెంబర్‌లు అన్నీ ఒకే మెంబర్‌షిప్‌లో కేవలం సంవత్సరానికి ₹1499కి సేవింగ్, సౌలభ్యం, వినోదాన్ని పొందుతారు.
సాగర్ చుట్టూ ఉన్న వ్యక్తులు, పేపర్ క్లిప్స్ ద్వారా తను సాగర్ అంచనా వేసినట్లే చనిపోతుంటారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సాగర్ ఈ దురదృష్టకర సంఘటనలను ఆపడానికి ఒక మార్గాన్ని కనుగొనాలని తెలుసుకుంటాడు.
దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ “దూత అంటే 'ది మెసెంజర్'. సూపర్ నేచురల్, ఊహాతీతమైన ఎలిమెంట్స్ తో కడిన ఫాస్ట్ పేస్డ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ప్రేక్షకులలు సీట్ఎడ్జ్ థ్రిల్ ఫీలింగ్ ని ఇస్తుంది. ప్రేక్షకులు సాగర్ జీవితంలో తరువాత ఏమి జరుగుతుందో అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు. సాగర్ గతం, అతనికి తెలిసిన, అతను ప్రేమించే ప్రతి ఒక్కరినీ వెంటాడుతూ వుంటుంది. మానవ మనస్తత్వం అన్వేషణను లోతుగా పరిశీలించే ఈ సిరీస్ భారతదేశంలోనే కాకుండా 240 దేశాలు, అన్ని చోట్ల ప్రైమ్ వీడియో చూసే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది'' అన్నారు
నాగ చైతన్య అక్కినేని మాట్లాడుతూ.. దూత నటుడిగా గొప్ప తృప్తిని ఇచ్చింది. విక్రమ్, మొత్తం టీమ్‌తో కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. దూత వంటి విలక్షణమైన సిరీస్‌తో నా స్ట్రీమింగ్ అరంగేట్రం చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇంత యూనిక్ కథలో సాగర్ లాంటి భిన్నమైన కోణాలు వున్న పాత్రలో చేయడం, నా కంఫర్ట్ జోన్ నుండి బయటకి వచ్చి, ఇంతకు ముందు చేయని పాత్రను చేయడం ఒక సవాల్ తీసుకున్నాను. ఇది కల్పిత కథ అయినప్పటికీ, దూత ఆలోచనను రేకెత్తిస్తుంది. ఈ సిరీస్‌ని నాఅభిమానులతో పాటు థ్రిల్లర్ జానర్ ని విపరీతంగా ఇష్టపడే ఫాలోవర్లు కూడా ప్రైమ్ వీడియోలో ఈ సిరిస్ చూసి ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది'' అన్నారు.
పార్వతి తిరువోతు మాట్లాడుతూ.. దూతలో క్రాంతి అనే పోలీసు పాత్రను పోషించడం ఒక సవాలుగానూ అలాగే గొప్ప ఉత్తేజకరమైన అనుభవంగా అనిపించింది. ఇందులో నా పాత్ర చాల కీలకంగా వుంటుంది. ఈ సిరీస్ నేరస్థుడి కోసం వేట మాత్రమే కాదు.. చట్టాన్ని అమలు చేసే అధికారి, జర్నలిస్ట్ మధ్య మైండ్ బెండింగ్ క్యాట్ అండ్ మౌస్ చేజ్ వుంటుంది. నా మొదటి తెలుగు ప్రాజెక్ట్ విక్రమ్, నాగ చైతన్య లాంటి ప్రతిభావంతులతో కలసి చేయడం చాలా థ్రిల్‌గా అనిపించింది. ప్రేక్షకుల స్పందన చూడటానికి ఎదురుచూస్తున్నాను” అన్నారు.
ప్రాచీ దేశాయ్ మాట్లాడుతూ ' దూతతో తెలుగులో అరంగేట్రం చేయడం ఆనందంగా వుంది. విక్రమ్ ఈ సిరిస్ లో మహిళా పాత్రలను చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారు. ఇలాంటి పాత్రలు మెయిన్ స్ట్రీమ్ ఎంటర్ టైమెంట్ లో కూడా ఇదివరకు రాలేదు. నా పాత్ర అమృత సహోద్యోగి మాత్రమే కాదు, సాగర్‌కి నమ్మకస్థురాలు కూడా. సాగర్ తెలిసిన ప్రతి ఒక్కరినీ అనుసరించే వివరించలేని సంఘటనలలో నా పాత్ర కీలకంగా వుంటుంది. సిరీస్‌లోని మలుపులు ప్రేక్షకులు అంచనా వేయలేరని భావిస్తున్నాను'' అన్నారు.
ప్రియా భవానీ శంకర్ మాట్లాడుతూ “దూత అనేది థ్రిల్లర్ జానర్ అభిమానులకు కంప్లీట్ ట్రీట్. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులకు చాలా ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది.ఈ సిరీస్‌లోని ప్రతి పాత్ర కథను ముందుకు తీసుకెళ్లడంలో, సంఘటనలని కనెక్ట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీనియస్ విక్రమ్ అద్భుతంగా ఈ సిరిస్ ని మలిచారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయబడే అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు సంతోషిస్తున్నాను' అన్నారు