Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న "ప్రేమంటే సులువు కాదురా"

రాజీవ్ సాలూరి - సిమ్మీదాస్ జంటగా.. యువ ప్రతిభాశాలి చందా గోవింద్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. "ఆర్.పి ప్రొడక్షన్స్" పతాకంపై భవనాసి రాంప్రసాద్ నిర్మిస్తున్న ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ "ప్రేమంటే

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (16:39 IST)
రాజీవ్ సాలూరి - సిమ్మీదాస్ జంటగా.. యువ ప్రతిభాశాలి చందా గోవింద్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. "ఆర్.పి ప్రొడక్షన్స్" పతాకంపై భవనాసి రాంప్రసాద్ నిర్మిస్తున్న ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ "ప్రేమంటే సులువు కాదురా". కొమారి సుధాకర్ రెడ్డి-శ్రీపతి శ్రీరాములు ఈ చిత్రానికి సహ నిర్మాతలు. నందన్ రాజ్ సంగీతం సమకూర్చిన ఈ విభిన్న ప్రేమకథా చిత్రానికి "ప్రాణం" కమలాకర్ రీ-రికార్డింగ్ చేశారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్న ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. "మా దర్శకుడు చందా గోవింద్ రెడ్డి "ప్రేమంటే సులువు కాదురా" చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు. స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే "ప్రాణం" కమలాకర్ ఆర్.ఆర్ కూడా. ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖ సంగీత దర్శకులు కోటి "మా అబ్బాయి రాజీవ్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో "ప్రేమంటే సులువు కాదురా" ది బెస్ట్ సినిమా" అంటూ కాంప్లిమెంట్ ఇవ్వడం.. ఈ సినిమా సాధించబోయే విజయంపై మాకు మరింత నమ్మకం కలిగించింది. 
 
అలాగే.. "భలే భలే మగాడివోయ్", "బాబు బంగారం" వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు ఎడిటింగ్ చేసిన ఎస్.బి.ఉద్ధవ్ సబ్జెక్టు నచ్చి మా చిత్రానికి పని చేయడం మాకు గర్వకారణం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. "2016లో ఘన విజయం సాధించిన చిత్రాల జాబితా"లో "ప్రేమంటే సులువు కాదురా" ఖచ్చితంగా ఉంటుందనే నమ్మకం మాకుంది" అన్నారు. 
 
కాశీ విశ్వనాథ్, మధుమణి, చమక్ చంద్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన "ప్రేమంటే సులువు కాదురా" చిత్రానికి కెమెరా: సురేష్ రఘుట, ఎడిటింగ్: ఎస్.బి ఉద్ధవ్, పాటలు: కృష్ణ మాదినేని, సంగీతం: నందన్ రాజ్, నేపథ్య సంగీతం: "ప్రాణం" కమలాకర్, సహ నిర్మాతలు: కొమారి సుధాకర్ రెడ్డి-శ్రీపతి శ్రీరాములు, నిర్మాత: భవనాసి రాంప్రసాద్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: చందా గోవింద్ రెడ్డి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments