Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమమ్ క్రేజ్... నాగచైతన్య, శ్రుతి హాసన్, వెంకీ కామెడీ రోల్...?(video)

నాగచైతన్యతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలన్న కసితో అక్కినేని నాగార్జున ఉన్నారు. అందుకే ఈసారి సూపర్ కాంబినేషన్‌తో తన కుమారుడు నాగచైతన్యను తీసుకొస్తున్నాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా, ఓ ప్రత్యేక పాత్రలో విక్టరీ వెంకటేష్

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (12:38 IST)
నాగచైతన్యతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలన్న కసితో అక్కినేని నాగార్జున ఉన్నారు. అందుకే ఈసారి సూపర్ కాంబినేషన్‌తో తన కుమారుడు నాగచైతన్యను తీసుకొస్తున్నాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా, ఓ ప్రత్యేక పాత్రలో విక్టరీ వెంకటేష్ నటించనున్నాడని సమాచారం. దీనితో ఈ చిత్రంపై క్రేజ్ ఏర్పడింది. 
 
ఇదిలావుండగా చైతూ సినిమా సాహసం శ్వాసగా సాగిపో చిత్రం విడుదల వాయిదాలు పడుతూ వస్తోంది. ప్రేమమ్ చిత్రం కూడా దాదాపు రెడీ అయిపోయింది. దీనితో ఏ చిత్రాన్ని ముందుగా రిలీజ్ చేయాలన్న దానిపై చైతన్య క్లారిటీకి వచ్చినట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. సెప్టెంబరు 9న సాహసం శ్వాసగా సాగిపో చిత్రాన్ని రిలీజ్ చేశాక దసరా పండుగ కానుకగా ప్రేమమ్ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు చెపుతున్నాయి. 
 
ఇప్పటికే ప్రేమమ్ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. కింగ్ నాగార్జున బర్త్ డే సందర్భంగా మరో వీడియో సాంగ్ను, తాత అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజున ప్రేమమ్ ఆడియోను గ్రాండ్గా రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చైతన్య సరసన శృతిహాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకుడు.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments