Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమకు 'ఇక సె..లవ్‌'.. ఎవరి కోసం చనిపోయానో ఆ అమ్మాయి రాలేదు!

Webdunia
శనివారం, 28 మే 2016 (11:39 IST)
గ్రీన్‌ సన్‌ ఇన్నొవేటివ్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'ఇక సె..లవ్‌'. జైహిత సమర్పిస్తున్నారు. గన్నవరపు చంద్రశేఖర్‌, డుంగ్రోత్‌ పీర్యా నాయక్‌, గ్యార రవి నిర్మాతలు. నాగరాజ్‌ దర్శకుడు. సాయి రవి, దీప్తి జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. నాగేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 
 
నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ... నాగరాజ్‌ ఓ సినిమాకు గోస్ట్‌ రచయితగా పనిచేశాడు. ఆ తర్వాత అతని కోసం నేను చాలా ఆరా తీశాను. ఈ సినిమాకు దర్శకుడిగా కనిపించాడు. ఈ సినిమా కాన్సెప్ట్‌ బావుంది. 'నేను చనిపోయినప్పుడు ప్రపంచం మొత్తం నా వెనుక కదిలింది. కానీ నేను ఎవరి కోసం చనిపోయానో ఆ అమ్మాయి మాత్రం రాలేదని' పోస్టర్స్‌ పై రాసిన వాక్యాలు చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. ఈ సినిమా తప్పక హిట్‌ కావాలని ఆకాంక్షించారు. 
 
దర్శకుడు మాట్లాడుతూ.. ఇ.వి.వి., రవిరాజా పినిశెట్టిగారి దగ్గర దాదాపు 70 చిత్రాలకు పైగా పనిచేశాను. దర్శకుడిగా నాకు ఇదే తొలి సినిమా. మానవ సంబంధాలన్నీ మృగ్యమైపోతున్న నేటి సమాజంలో ఎలాంటి కాలదోషం పట్టని ఒకే ఒక బంధం ప్రేమ, ఈ విషయాన్ని చర్చిస్తూ తీసిన చిత్రమిదని అన్నారు. 
 
నిర్మాతలు మాట్లాడుతూ.. ఫస్ట్‌ కాపీ సిద్ధంగా ఉన్న ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్‌ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రానికి మధు నాలుగు అద్భుతమైన పాటలను అందించారు. నేపథ్య సంగీతాన్ని కమల్‌ అద్భుతంగా అందించారని అన్నారు. సాయి రవి మాట్లాడుతూ... సోలో హీరోగా నాకు ఇదే తొలి సినిమా అని చెప్పారు. ఈ సినిమాకు కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, ఎడిటింగ్‌: నాగిరెడ్డి, సంగీతం: మధు, కథ-మాటలు-స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: నాగరాజ్‌. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments