Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ‌ర్భ‌వ‌తి అయిన ప్రియ‌మ‌ణి!

Webdunia
గురువారం, 1 జులై 2021 (12:07 IST)
న‌టి ప్రియ‌మ‌ణి తెలుగులో `పెళ్ల‌యి కొత్త‌లో` సినిమాలో జ‌గ‌ప‌తిబాబు స‌ర‌స‌న న‌టించింది. ఆ త‌ర్వాత ఎన్‌.టి.ఆర్‌.తో యందొంగలో న‌టించింది. అనంత‌రం గోలీమార్‌, ర‌గ‌డ‌, మన‌వూరి రామాయ‌ణం సినిమాల్లో న‌టించింది. అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఆమె ఫిజిక్‌లో చాలా వ్య‌త్యాసం క‌నిపిస్తుంది. లేటెస్ట్‌గా ఢీ అనే టీవీ ప్రోగ్రామ్‌లో బాగా బ‌క్క‌ప‌ల‌చ‌గా మారిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇందుకు కార‌ణం ఏమిటంటే, తాను వ్యాయామం కోసం బాగా స‌మ‌యం వెచ్చిస్తుంటాన‌ని చెబుతోంది.
 
తాజాగా ఆమె రానాతో `విరాట‌ప‌ర్వం`లోనూ వెంక‌టేష్‌తో నార‌ప్ప‌లోనూ న‌టించింది.ఈ రెండు సినిమాలు విడుద‌ల కావాల్సి వున్నాయి. తాజాగా ఆమె ఓ తెలుగు సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. `యాక్ట్ 1978` అనే క‌న్న‌డ సినిమాకు రీమేక్ ఇది. దీనిని ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన చ‌ర్చ‌లు పూర్త‌య్యాయి. కాగా, ఇందులో ఆమె గ‌ర్భ‌వ‌తిగా న‌టించాలి. ప్ర‌భుత్వం కార్యాల‌యం చుట్టూ త‌న‌కు రావాల్సిన న‌ష్ట‌ప‌రిహారం కోసం తిరిగే పాత్ర అది. గ‌ర్భవ‌తిగా ఆమె అలా తిర‌గ‌డం సినిమాలోని కీల‌కాంశం. ఇదే పాత్ర క‌న్న‌డ‌లో హైటైల్ అయింది. ఆ పాత్ర‌ను క‌న్న‌డ న‌టి య‌జ్ఞ‌శెట్టి న‌టించింది. ఇప్పుడు ప్రియ‌మ‌ణి ఆ పాత్ర‌లో జీవించ‌డానికి త‌గువిధంగా సిద్ధ‌మ‌వుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

యూకే పర్యటన కోసం పర్మిషన్ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు

Madhavi Latha: తాడిపత్రి వాళ్లు పతివ్రతలు కాబట్టి సినిమాల్లోకి రాకండి.. మాధవీ లత

పవన్ కల్యాణ్‌కు తలనొప్పి తెస్తున్న రేవ్ పార్టీలు.. మళ్లీ కొత్త కేసు.. ఎక్కడ?

Kumari Aunty : కుమారి ఆంటీ వ్యాపారంతో ట్రాఫిక్ జామ్.. వారం పాటు బంద్..

చైనాను చుట్టేస్తున్న HMPV వైరస్, లక్షణాలేంటి? భారత్ పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments