Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ బాపుగారి బొమ్మను ఎవరూ ఏమీ అడగలేదట: ప్రణీత చెప్పేది నిజమేనా?

అత్తారింటికి దారేది సినిమా ఒకే ఒక్క పాటతో తెలుగు ప్రజలకు కిరాక్ తెప్పించిన కన్నడ అమ్మాయి ప్రణీత. ఆ సినిమాలో పాడిన బాపుగారి బొమ్మో పాటకు నిజంగా బాపుగారి బొమ్మలాగానే ప్రాణం పోసిన యువనటి ప్రణీత. అయితే దురదృష్టం ఏంటో గానీ అత్తారింటికి దారేది చిత్రంలో లాగ

Webdunia
శనివారం, 25 మార్చి 2017 (06:45 IST)
అత్తారింటికి దారేది సినిమా ఒకే ఒక్క పాటతో తెలుగు ప్రజలకు కిరాక్ తెప్పించిన కన్నడ అమ్మాయి ప్రణీత. ఆ సినిమాలో పాడిన బాపుగారి బొమ్మో పాటకు నిజంగా బాపుగారి బొమ్మలాగానే ప్రాణం పోసిన యువనటి ప్రణీత. అయితే దురదృష్టం ఏంటో గానీ అత్తారింటికి దారేది చిత్రంలో లాగే ఆమెకు సినిమాల్లో సెకండ్ చాన్సే వస్తోంది కాని తెలుగులో ఆమెకు కథానాయక పాత్రలు దొరకటం లేదు. హీరోయిన్‌గా కాకున్నా తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఒక్కో చిత్రం చేతిలో ఉన్న ప్రణీత ఏనాటికైనా తనకూ మంచి అవకాశాలు వస్తాయన్న విశ్వాసంతోనే నట జీవితంలో కొనసాగుతోంది.
 
తల్లిదండ్రులు డాక్టర్లు. వారి కలలు, లక్ష్యం నెరవేర్చే మంచి కూతురిగా ఉండాలనే ఆశిస్తున్న ప్రణీత ఏడాది మొత్తం నటిస్తూ బిజీగా ఉండాలన్న ఆశ తనకు లేదంటోంది. తెలుగు, కన్నడ భాషల్లో తనకు మంచి పాత్రలే వస్తున్నాయని వాటిని వదిలి బాలీవుడ్‌కు పరిగెత్తాల్సిన అవసరం తనకు లేదంటోంది. తెలుగు సినిమాల్లో గ్లామర్ పాత్రలకు గిరాకీ ఉంది కాని తననెవరూ గ్లామరస్‌గా నటించాలని అడగలేదని, తనకు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి హోమ్లీ ఇమేజే ఉందని అంటున్న ప్రణీతకు దక్షిణాది భాషలన్నింట్లో నటించాలన్న ఆశ మాత్రం బలంగా ఉంది.
 
గ్లామర్ పాత్రలు పోషించాలని తనను ఎవరూ ఒత్తిడి చేయలేదని ప్రణీత చెప్పడం అర్థ సత్యమేనేమో. ఎందుకంటే ఆమె ఏ వేషం ధరించిన గ్లామర్‌కు కేంద్రబిందువులాగే ఉంది కదా మరి. గుండరాల్లాంటి కళ్లతో కుర్రకారును ఇట్టే ఆకర్షించే ప్రణీతకు ఇక వేరే గ్లామర్‌తో పని ఏంటి అంటున్నారు ఆమె అభిమానులు. ఇదీ నిజమే కదా.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య... కారణాలేంటో?

పార్టీలో చేరిన తర్వాత జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారు : డొక్కా మాణిక్యవరప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments