Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోహన్ బాబు రౌడీయిజం, బూతులను హైలెట్ చేసిన ప్రకాష్ రాజ్

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (17:42 IST)
మా ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్‌ను ఓడించి గెలిచారు. అయితే ప్రకాష్ రాజ్ ఓడిపోయినా తర్వాత మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
ఈ విషయంపై మంచు విష్ణు కూడా స్పందించాడు. పరాజయం తర్వాత ప్రకాష్ రాజ్ చాలా సీరియస్‌గా ఉన్నాడు. మంచు విష్ణు కలిసి మాట్లాడుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పిన రాజినామా వెనక్కి తీసుకోవాలని కోరిన ప్రకాష్ రాజ్ మాత్రం ఎక్కడ తగ్గకుండా ఉన్నాడు.
 
తన రాజీనామా నిర్ణయం వెనుక లోతైన అర్ధం ఉందని మొన్న సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ మరొకసారి గొడవలు రేపే విధంగా మాట్లాడారు. ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఒక లేఖను రాసారు. 
 
మా ఎన్నికల్లో మోహన్ బాబు రౌడీయిజం, బూతులను హైలెట్ చేస్తూ లేఖ రాయడంతో మరొకసారి వివాదం రాజుకుంది. ఎన్నికలకు సంబంధించిన సిసి టివి ఫుటేజ్ ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాసారు.
 
వీలైనంత త్వరగా ఆ సిసిటివి ఫుటేజ్ ఇవ్వకపోతే దానిని మాయం చేస్తారని ఆయన కోరారు. కొందరు సభ్యులను గాయపరిచారని ఆ సిసి టివి ఫుటేజ్ బయటకు వస్తే అన్ని తెలుస్తాయని తెలిపారు. దీనిపై కృష్ణ మోహన్ స్పందిస్తూ సిసి టీవీ ఫుటేజ్ సేఫ్ గానే ఉందని నిబంధనలు ప్రకారం ఎవరు అడిగిన ఇస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments