Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కావేరీ'కి 'కాలా'కు సంబంధం ఏంటి.. ఎపుడూ మమ్మల్నే టార్గెట్ చేస్తారా? ప్రకాష్ రాజ్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం "కాలా". ఈ చిత్రం ఈనెల ఏడో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రం కావేరీ వివాదంలో చిక్కుకుంది. ఫలితంగా కర్ణాటక రాష్ట్రంలో విడుదలకు నోచుకోలేని

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (13:51 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం "కాలా". ఈ చిత్రం ఈనెల ఏడో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రం కావేరీ వివాదంలో చిక్కుకుంది. ఫలితంగా కర్ణాటక రాష్ట్రంలో విడుదలకు నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా చిత్ర నిర్మాతకు రూ.30 కోట్ల మేరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీనిపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు.
 
కావేరీ వివాదానికి 'కాలా' చిత్రానికి సంబంధమేమిటని ఆయన ప్రశ్నించారు. ఎపుడు చూసినా ఏదో ఒక వివాదంపై ముడిపెట్టి సినిమా వాళ్లనే ఎందుకు టార్గెట్ చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు. బీజేపీ ప్ర‌భ‌త్వం 'ప‌ద్మావ‌త్' చిత్రం విషయంలో వ్య‌వ‌హ‌రించిన‌ట్టుగానే.. ఇక్క‌డి కర్ణాటక ప్ర‌భుత్వం 'కాలా'తో వ్య‌వ‌హ‌రిస్తోందని ఆయన మండిపడ్డారు. 
 
అదేసమయంలో 'కాలా' చిత్రంపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తోంది తాము కాద‌ని క‌ర్ణాట‌క ఫిల్మ్ ఛాంబ‌ర్ స‌భ్యులు చెపుతున్నారనీ, ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక‌త వ‌ల్లే ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌క‌పోవ‌డ‌మే మంచిదని డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు స్వ‌చ్ఛందంగా నిర్ణ‌యం తీసుకున్నారని చెప్పడం భావ్యంకాదన్నారు. ఏదిఏమైనా 'కాలా' నిషేధానికి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలే బాధ్య‌త వ‌హించాల'ని ప్రకాష్‌రాజ్ అభిప్రాయపడ్డారు. 
 
కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కావేరీ జలాల పంపిణీ కోసం నిర్వహణ మండలిని ఏర్పాటు చేయాలని తమిళనాట పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ సమయంలో రజినీకాంత్ కూడా ఈ ఆందోళనలకు మద్దతు తెలిపారు. దీనిపై కన్నడ ప్రజలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కారణంగానే ఇపుడు 'కాలా' చిత్రం విడుదలను వారు అడ్డుకునేందుకు చూస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments