Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్.ఎస్ రాజమౌళి మోసం చేశారు... బాధగా ఉంది. : విలన్ ప్రదీప్‌ రావత్‌

ఎస్ఎస్ రాజమౌళి తనను మోసం చేశారంటూ టాలీవుడ్ ప్రతినాయకుడు ప్రదీప్ రావత్ అంటున్నారు. అలాగే, రాజమౌళి తనకు గురువు అని, ఆయన రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేనని చెపుతున్నారు. ఇంతకీ ప్రదీప్ రావత్ ఇలా ఎందుకు అన్నా

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (10:26 IST)
ఎస్ఎస్ రాజమౌళి తనను మోసం చేశారంటూ టాలీవుడ్ ప్రతినాయకుడు ప్రదీప్ రావత్ అంటున్నారు. అలాగే, రాజమౌళి తనకు గురువు అని, ఆయన రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేనని చెపుతున్నారు. ఇంతకీ ప్రదీప్ రావత్ ఇలా ఎందుకు అన్నారో పరిశీలిద్ధాం. 
 
రాజమౌళి 'లగాన్‌' చిత్రం చూసి నా నటన మెచ్చుకుంటూ తన మేనేజర్‌ను ముంబైలోని అమీర్‌ఖాన్‌ ఆఫీసుకు పంపించారు. అక్కడ నా అడ్రస్‌ తెలుసుకుని ఆ మేనేజర్‌ మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. ఆ వెంటనే రాజమౌళితో ఫోన్లో మాట్లాడాను. నన్ను హైదరాబాద్‌ రమ్మని చెప్పారు. నేను వెళ్లి ఆయన కలవడం, ఆయిన ఇచ్చిన ఆఫర్‌కు ‘సై’ అనడం జరిగాయి. తెలుగులో నేను నటించిన మొదటి చిత్రం ‘సై’. సూపర్‌హిట్‌ మూవీ. ఈ చిత్రంలో అంత బాగా నటిస్తానని నేనే అనుకోలేదు. ఇక అప్పటి నుండి తెలుగులో మంచిపాత్రల్లో నటించేందుకు అవకాశాలు రావడం ఆరంభమైంది.
 
ముఖ్యంగా.. రాజమౌళి మరో చిత్రం ‘ఛత్రపతి’లో కూడా విలన్‌గా నా నటన అద్భుతం అని ఎంతోమంది అభిమానులు నాపైన అభినందనల వర్షం కురిపించారు. ఇంత చక్కని అవకాశం కల్పించిన రాజమౌళికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన నాకు గాడ్‌ఫాదర్‌. ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండు చిత్రాలూ నాకు రెండు కళ్ళులాంటివన్నారు. 
 
అయితే, బాహుబలిలో ఎంత చిన్న పాత్ర ఇచ్చినా చేయాలనే కుతూహలం ఉండేది. అందులో నటించలేకపోయాననే బాధ ఉంది. బాహుబలి–2కి కూడా నన్ను పిలవకపోవడం ఇంకా బాధ అనిపించింది. హమ్‌ జబర్దస్తీ నయ్‌ జా సక్తేనా (బలవంతంగా వెళ్ళి అడగలేనుగా). పిలవకపోవడానికి బలమైన కారణం ఉండే ఉంటుందేమో! అది ఆయనకే వదిలేద్దాం. అయినా గానీ రాజమౌళి నాకు ఎప్పటికీ గాడ్‌ ఫాదరే. భవిష్యత్తులో ఎప్పటికైనా మళ్ళీ ఆయన చిత్రంలో నటించాలని ఉందని చెప్పారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments