Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొంబాయి వెళ్తే డైరెక్టర్‌ను... హైదరాబాద్ అయితే డాన్స్ మాస్టర్‌ని... ప్రభుదేవా

ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ ప్రధాన తారాగణంగా కోన ఫిలిం కార్పొరేషన్, బ్లూ సర్కిల్ కార్పొరేషన్, బి.ఎల్.ఎన్.సినిమా, ఎం.వి.వి.సినిమా బ్యానర్స్‌పై సంయుక్తంగా రూపొందుతోన్న చిత్రం అభినేత్రి. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో ఈ సినిమాను ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (10:43 IST)
ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ ప్రధాన తారాగణంగా కోన ఫిలిం కార్పొరేషన్, బ్లూ సర్కిల్ కార్పొరేషన్, బి.ఎల్.ఎన్.సినిమా, ఎం.వి.వి.సినిమా బ్యానర్స్‌పై సంయుక్తంగా రూపొందుతోన్న చిత్రం అభినేత్రి. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో ఈ సినిమాను ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్ విడుదల  కార్యక్రమాన్ని శుక్రవారం హైదరాబాదులో విడుదల చేశారు. డ్యాన్సింగ్ టీజర్‌ను సోనూసూద్ విడుదల చేశారు. ట్రైలర్‌ను వి.వి.వినాయక్ విడుదల చేశారు. 
 
వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘’టైటిల్ బావుంది. తమన్నాకు కరెక్ట్‌గా సూటయ్యే టైటిల్. తనతో రెండు సినిమాలు వర్క్ చేశాను. ఈ సినిమాలో తనే హీరో. కోన వెంకట్ కొత్త విషయాలతో సినిమా చేయాలని తాపత్రయ పడుతుంటారు. కథను నాకు చెప్పగానే బాగా అనిపించింది. విజయ్ డైరెక్ట్ చేసిన మదరాసు పట్టణం సినిమా చూస్తే ఆయన గొప్ప దర్శకుడని తెలుస్తుంది. సోనూసూద్ మన టాలీవుడ్ నుండి వెళ్లి ఇప్పుడు హాలీవుడ్‌లో సినిమా చేస్తున్నాడు. అందుకు మనమంతా గర్వపడాలి. ప్రభుదేవాగారు డ్యాన్స్‌ను ఇంకా మరచిపోలేకపోతున్నాం. ఆయన హైదరాబాద్‌లో ఓ డ్యాన్స్ స్కూల్ పెట్టాలి. టీం అంతటికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు. 
 
డైరెక్టర్ ఎ.ఎల్.విజయ్ మాట్లాడుతూ ‘’2012లో పాల్ ఆరోన్‌తో కలిసి ఈ స్క్రిప్ట్‌ను రాసుకున్నాను. కొన్ని కారణాలతో సినిమా రూపొందనేలేదు. అయితే గణేష్ గారి సహకారంతో సినిమా ఈ స్టేజ్‌కు వచ్చింది. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. తమన్నా ఫస్ట్ హాఫ్ వినగానే చేస్తానని సెకండాఫ్ కూడా వినలేదు. తమన్నాకు స్పెషల్ మూవీగా ఆమె కెరీర్ లోనే నిలిచిపోయే చిత్రమవుతుంది. సోనూసూద్ గారు డిఫరెంట్ రోల్ చేశారు. తప్పకుండా అందరినీ థ్రిల్ చేసే సినిమా అవుతుంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు. 
 
కోన వెంకట్ మాట్లాడుతూ ‘’మంచి సినిమా వల్ల అందరికీ మంచి జరుగుతుంది. మంచి సినిమా కోసం మంచి కథ అవసరం. ప్రభుదేవా గారికి ఓ కథను చెప్పడానికి ముంబై వెళ్లినప్పుడు ప్రభుదేవా గారు నాకు అభినేత్రి కథను వినిపించారు. కథ నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. 54 సినిమాల రచయితగా థ్రిల్ ఫీలైన కథ ఇది. ప్రభుదేవా గారి సలహాతో ఎ.ఎల్.విజయ్ గారిని కలిశాను. ఆయన చెప్పిన ఐదు నిమిషాల కథ విని థ్రిల్ అయ్యాను. ఓ ఇంటికి పునాది, పిల్లర్స్ ఎలా అవసరమో ఈ సినిమా విషయానికి వస్తే తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్, డైరెక్టర్ విజయ్ గార్లు పిల్లర్స్‌లా నిలబడ్డారు. కథ పునాదిలా నిలబడింది. మంచి కథ కారణంగా ఇదొక పాన్ ఇండియా సినిమా అయ్యింది. తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్ మినహా ఏ భాషకు చెందిన నటీనటులు ఆ భాషలో నటించారు. తెలుగు, తమిళం, హిందీల్లో ప్రతి సీన్‌ను చిత్రీకరించాం’’ అన్నారు. 
 
డి.సురేష్ బాబు మాట్లాడుతూ ‘’ ఈ సినిమా కథను నేను విన్నాను. చాలా బావుంది. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్. పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘’సినిమ పోస్టర్‌ను చూస్తుంటే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనిపిస్తుంది. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు. 
 
శివ తుర్లపాటి మాట్లాడుతూ ‘’నేను కొరియోగ్రాఫర్‌ని. పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాను. శంకరాభరణం సినిమా కోసం కోన వెంకట్ గారితో కలిసి పనిచేశాను. సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్స్’’ అన్నారు. 
 
ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ‘’మా మ్యానర్‌లో ఓ మంచి సినిమా రూపొందుతుందని కచ్చితంగా చెప్పగలను. సినిమా తప్పకుండా పెద్ద హిట్టవుతుంది’’ అన్నారు. సోనూసూద్ మాట్లాడుతూ ‘’ప్రభుదేవా, తమన్నా, సత్యనారాయణగారితో మంచి రిలేషన్ ఈ సినిమా వల్ల ఏర్పడింది. బ్రిలియంట్ స్క్రిప్ట్ కాబట్టి ఈ సినిమా హిందీ వెర్షన్ కోసం నేను నిర్మాతగా మారాను. డైరెక్టర్ విజయ్ గారు సినిమాను ఎక్సలెంట్‌గా డైరెక్ట్ చేశారు’’ అన్నారు. 
 
ప్రభుదేవా మాట్లాడుతూ ‘’నాకు హైదరాబాద్ లక్కీ సిటీ. ఇక్కడకు వస్తేనే డ్యాన్స్ మాస్టర్‌గా మారిపోతాను. అభినేత్రి విషయానికి వస్తే కథ బాగా నచ్చడంతో నేను, గణేష్ గారు ఈ సినిమాను తమిళంలో నిర్మిస్తున్నాం. ఈ సినిమా జర్నీ చాలా బాగా నచ్చింది. తమన్నా చాలా మంచి నటి. ఎక్సలెంట్ పెర్‌ఫార్మెన్స్ చేసింది’’ అన్నారు. 
 
తమన్నా మాట్లాడుతూ ‘’నాకు కోనవెంకట్ గారితో శ్రీ సినిమా నుండి పరిచయం ఉంది. నా లైఫ్‌లో ఆయన స్పెషల్ పర్సన్. నా గ్రోత్‌ను ఆయన ముందు నుండి చూసి ఎంకరేజ్ చేస్తున్నారు. మన నుండి ఆడియెన్స్ కొత్తదనాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అలాంటి కొత్తదనం ఈ సినిమాలో చూస్తారు. డైరెక్టర్ విజయ్ గారితో చాలాకాలంగా మంచి పరిచయం ఉంది. ఈ సినిమా కథను ఆయన చెప్పడానికి వచ్చినప్పుడు మొదటి పదినిమిషాల్లోనే ఓకే చెప్పేశాను. 
 
ఈ సినిమాతో ఆయన నన్ను ఇంకా బెటర్ హీరోయిన్‌ను చేసి పంపుతున్నారు. అలాగే ప్రభుదేవాగారితో కలిసి ఈ సినిమా చేయడం నా అదృష్టం. ఆయన కింగ్ ఆఫ్ డ్యాన్స్ కాదు. గాడ్ ఆఫ్ డ్యాన్స్. ఆయన్ను కలవడం కోసమే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే టైటిల్ మాత్రమే నాది కానీ హీరోయిన్ సెంట్రిక్ మూవీ కాదు, ప్రభుదేవాగారు లేకపోతే ఈ సినిమా లేదు. అలాగే సోనూసూద్ గారితో కలిసి యాక్ట్ చేయడం హ్యపీగా ఉంది. ఈ సినిమాతో ఆయన నిర్మాతగా మారుతున్నాను. అలాగే ఇది హర్రర్ మూవీ కూడా కాదు. పర్టిక్యులర్ జోనర్ మూవీ అని కూడా చెప్పలేం. ఇందులో నటించిన నటీనటులు, టెక్నిషియన్స్‌కు థాంక్స్’’ అన్నారు. 
 
ఈ చిత్రానికి సంగీతం: సాజిద్-వాజిద్, జి.వి.ప్రకాష్, విశాల్, సినిమాటోగ్రఫీ: మనుష్ నందన్, డైలాగ్స్: కోన వెంకట్, కథ: విజయ్, పాల్ ఆరోన్, ఎడిటర్: టోని, స్టంట్స్: మనోహర్ వర్మ, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, పరేష్, ప్రవీణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశ్విన్ కుమార్, ఓమర్ లతీఫ్, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, దర్శకత్వం: విజయ్ ఎ.ఎల్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Gratitude Boat Rally: కాకినాడలో మత్స్యకారుల బోట్ ర్యాలీ.. ఎందుకో తెలుసా?

Pakistani Family in Visakhapatnam: విశాఖలో పాకిస్థానీ ఫ్యామిలీ.. అలా పర్మిషన్ ఇచ్చారు..

అవన్నీ అవాస్తవాలు, మేం పాకిస్తాన్‌కు ఆయుధాలు పంపలేదు: టర్కీ

కాదంబరి జెత్వానీ కేసు.. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు నోటీసులు

YS Sharmila: గృహ నిర్భంధంలో షర్మిల - పోలీసులకు నన్ను ఆపే హక్కు లేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments