Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు బాహుబలిలో ఆ పాత్రంటేనే ఇష్టం.. కట్టప్ప తక్కువేమీ కాదు: ప్రభాస్

బాహుబలి సినిమాతో తెలుగు సినిమా రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాడు. బాహుబలి సినిమాలో అన్ని పాత్రలు చాలా గొప్పగా చిత్రీకరించారు డైరెక్టర్ రాజమౌళి. ముఖ్యంగా అన్ని పాత్రలలో ‘శివగామి’ రోల్‌ అద్భుతంగా ఉంద

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (17:58 IST)
బాహుబలి సినిమాతో తెలుగు సినిమా రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాడు. బాహుబలి సినిమాలో అన్ని పాత్రలు చాలా గొప్పగా చిత్రీకరించారు డైరెక్టర్ రాజమౌళి. ముఖ్యంగా అన్ని పాత్రలలో ‘శివగామి’ రోల్‌ అద్భుతంగా ఉంది. శివగామి పాత్ర పోషించిన రమ్యకృష్ణ నటనే సినిమాకు హైలైట్‌గా నిలిచింది. శివగామి పాత్ర కోసం రమ్యకృష్ణను ముందుగా అనుకోలేదని.. శ్రీదేవితో పాటు మరికొందరు బాలీవుడ్‌ నటీమణులలో ఎవరో ఒకరి చేత ఈ రోల్ చేయిద్దామని అనుకున్నాడు. 
 
ఇటీవల రాజమౌళి స్వయంగా చెన్నైలో జరిగిన బాహుబలి 2 ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ.. శివగామిగా నటించిన రమ్యకు సారీ చెప్పారు. ‘శివగామి’ పాత్ర కోసం మొదట వేరేవారిని అనుకున్నానని.. రమ్యకృష్ణగారు అందుబాటులో ఉన్నా.. వేరే వారి కోసం ప్రయత్నించా. అందుకు సిగ్గుపడుతున్నా. ఈ విషయంలో ఆమెకు నేను సభాముఖంగా క్షమాపణ కోరుతున్నా.. ఆవిడ అద్భుత నటనతో శివగామి పాత్రకు మంచి గుర్తింపు వచ్చిందని రాజమౌళి కొనియాడిన సంగతి తెలిసిందే
 
ఈ నేపథ్యంలో ‘బాహుబలి’ చిత్రంలో తన రోల్ కాకుండా శివగామి పాత్ర అంటే తనకు ఇష్టమని హీరో ప్రభాస్ కూడా వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ,‘‘బాహుబలి-1’లో శివగామి పాత్ర అల్టిమేట్. పవర్ ఫుల్ రోల్.. పవర్ ఆఫ్ విమన్ అంటూ కితాబిచ్చారు. అదేవిధంగా కట్టప్ప రోల్ కూడా తక్కువేమీ కాదు. ‘బాహుబలి-2’లో కట్టప్ప ఎలా చేస్తాడో చూస్తారని వ్యాఖ్యానించాడు. కాగా, ఈ నెల 28న ‘బాహుబలి-2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments