Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jagapathi Babu : బాహుబలి పెట్టిన ఫుడ్‌తో జగపతి బాబు (video)

సెల్వి
మంగళవారం, 10 డిశెంబరు 2024 (18:11 IST)
Jagapathi Babu
Prabhas food Jagapathi Babu : ప్రముఖ నటుడు జగ్గూ భాయ్ ప్రస్తుతం "ఫౌజీ" షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. తాజాగా జగపతి బాబు ప్రభాస్ తనకు పంపిన ఫుడ్ గురించి ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో నోరూరించే శాఖాహారం, మాంసాహారం వంటి ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. 
 
ఈ వీడియోకి జగపతి బాబు ఆసక్తికరమైన క్యాప్షన్‌ను ఇచ్చారు. వివాహ భోజనంబు అనే పాటను యాడ్ చేశారు. ఫుడ్ పెట్టే విషయంలో బాహుబలి లెవెల్ వేరు. పందికొక్కులాగా తిని, ఆంబోతులా పడుకుంటాను.. అంటూ జగపతిబాబు రాసుకొచ్చారు. 
 
బకాసురుడిలా భోజనం చేసి, కుంభకర్ణుడిలా నిద్ర పోతాను అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇది ప్రభాస్ ప్రమేయం లేకుండా జరిగిందని, దీని గురించి ఎవ్వరూ చెప్పొద్దని అన్నారు. ఎందుకంటే ఎవరైనా సరే చెప్తే తను పెట్టే ఫుడ్​తో ఈ బాబు బలి అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. అదీ బాహుబలి లెవల్ అంటూ కొనియాడారు. 
 
అంతేకాకుండా ఆ వీడియోలో "షూటింగ్ కోసం భీమవరం చేరుకున్నాను. భీమవరం రాజుల ఆతిథ్యం అద్భుతంగా ఉంది. జై భీమవరం, జై రాజులు, జై బాహుబలి, జై ప్రభాస్.." అంటూ ప్రభాస్ అతిథ్యంపై జగ్గు భాయ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Big Boost For Amaravati అమరావతి నిర్మాణం : తొలి దశలో చేపట్టే పనులు ఇవే...

నాగబాబుకు మంత్రి పదవిపై జనసేన మౌనం ఎందుకు?

కుటుంబాలను విడదీయను.. ఫ్యామిలీ మొత్తాన్ని అమెరికా నుంచి పంపించేస్తాను: ట్రంప్

పెళ్లి జరిగి 40 రోజులైంది.. లోన్ యాప్ వేధింపులకు యువకుడి బలి

కాంగోలో అంతుచిక్కని వ్యాధి.. 143 మంది మృతి.. పిల్లలే అధిక బాధితులా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health కండరాలు నొప్పులు, పట్టేయడం ఎందుకు?

తరచూ జలుబు చేయడం వెనుక 7 కారణాలు

Black Tea బ్లాక్ టీ తాగితే 6 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

స్పైనల్ మస్కులర్ అట్రోఫీ లక్షణాలను ఎదుర్కోడానికి అవగాహన అవసరం అంటున్న నిపుణులు

సూర్యరశ్మితో 7 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments