Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌ తొలి ఫోటోకు 2,47,000లకు పైగా లైకులు

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (11:58 IST)
యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాను తెరిచారు. కనీసం ప్రొఫైల్ ఫోటో కూడా లేకుండా, ఆ ఖాతాలో ఒక్క పోస్ట్ కూడా చేయనప్పుడే ఆయన ఇన్‌స్టాగ్రామ్‌కు ఏడు లక్షల మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. కాగా ప్రభాస్ ఎప్పుడు ప్రొఫైల్ పిక్ పెడతారు, ఏ పిక్చర్ పెడతారు, మొదటిగా ఏం పోస్ట్ చేస్తారని అభిమానులు అందరు ఆసక్తిగా ఎదురుచూశారు. రెబెల్ స్టార్ తాజాగా నటిస్తున్న సాహో చిత్రానికి సంబంధించిన పోస్ట్‌లు చేస్తారనీ, అందులోని స్టిల్‌నే ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంటారని ఊహించుకున్నారు. అయితే ప్రభాస్ మాత్రం అభిమానుల ఊహాగానాలకు ఎట్టకేలకు తెరదించారు.
 
తన సినీ జీవితంలో అతిపెద్ద మైలురాయిగా నిలిచి, ప్రపంచస్థాయిలో తనకు పేరు తెచ్చిపెట్టిన ‘బాహుబలి’ సినిమాలోని ఓ స్టిల్‌ను ప్రభాస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ ఫోటోనే తన ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నాడు. అంతే వెంటనే లైకుల వర్షం మొదలైంది. ఫోటో పాతదే అయినప్పటికీ.. తక్కువ సమయంలోనే దానికి రెండు లక్షల నలభై ఏడు వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. కాగా ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కూడా ఒక్కసారిగా భారీగా పెరిగి ఎనిమిది లక్షలు దాటింది. కాగా.. ఆ ఖాతా ఇప్పటివరకు వెరిఫైడ్ కాకపోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments