Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' ప్రభాస్ కొత్త మూవీ టైటిల్ ఏంటో తెలుసా?

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (18:36 IST)
భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో క్వాలిటీ చిత్రాల‌ను నిర్మించి ద‌క్షిణాది సినీ పరిశ్ర‌మ‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాల‌నే ఉన్న‌తాశ‌యంతో ప్రారంభమైన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌ ఇప్పుడు ప్యాన్‌ ఇండియా నిర్మాణ సంస్థగా మారింది. 
 
ఈ బ్యానర్‌లో రాకింగ్‌స్టార్ య‌ష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో చేసిన భారీ బడ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్ ప్యాన్‌ ఇండియా మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్‌1’ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. 
 
అలాగే మ‌రో ప్యాన్ ఇండియా భారీ బ‌డ్జెట్ మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’ చిత్రీకరణ దశలో ఉంది. ఈ  సినిమా విడుద‌ల గురించి ప్రేక్ష‌కాభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు హోంబ‌లే ఫిలింస్ అధినేత విజయ్‌ కిరగందూర్‌ తమ బ్యానర్‌లో మూడో ప్యాన్ ఇండియా మూవీగా "సలార్"ను రూపొందించనున్నట్లు ప్రకటించారు. సినిమా టైటిల్‌తో పాటు ప్రభాస్ లుక్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. 
 
ఈ సందర్భంగా విజయ్‌ కిరగందూర్‌ మాట్లాడుతూ "మా బ్యానర్‌లో కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1, కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2 వంటి ప్యాన్‌ ఇండియా చిత్రాల తర్వాత మూడో ప్యాన్‌ ఇండియా చిత్రాన్ని రూపొందించబోతున్నాం. అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాను రూపొందించనున్నారు. 
 
బాహుబలిగా ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించిన ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేయబోతున్నాం. ఇప్పుడు ప్రభాస్‌ చేస్తున్న 'రాధేశ్యామ్‌' విడుదల తర్వాత సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం. ప్యాన్‌ ఇండియా మూవీగా రూపొందనున్న "సలార్" చిత్రాన్ని భారతీయ భాషలన్నింటిలో రూపొందిస్తాం" అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గదికి రప్పించుకుని.. నగ్న ఫోటోలు తీసి?

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ.. ప్రమాణ స్వీకారంకు సర్వం సిద్ధం

వంట విషయంలో భర్తతో గొడవ.. చెరువులో చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య (video)

Rooster: మూడు గంటలకు కోడి కూస్తోంది.. నిద్ర పట్టట్లేదు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

26 ఏళ్ల వ్యక్తి కడుపులో పెన్ క్యాప్.. 21 సంవత్సరాల క్రితం మింగేశాడు.. ఇప్పుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments