Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపికా కోసం ప్రభాస్ ఇంటి నుంచి భోజనం... (video)

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (11:48 IST)
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్ ఒక హీరోగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి మనిషి. తనతో పాటు నటించే నటీనటులను ఎంతో బాగా చూసుకుంటారు. ముఖ్యంగా, హీరోయిన్ల విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు. ఇందులోభాగంగా, తనతో కలిసి హీరోయిన్లకు ఆయన ప్రత్యేకంగా ఇంటి నుంచి సెట్స్‌కు భోజనం తెప్పిస్తుంటారు. గతంలో సాహో చిత్రం సమయంలో బాలీవుడ్ నటి శ్రద్ధా దాస్‌కు ఇంటి నుంచి భోజనం సమకూర్చారు. ఇపుడు బాలీవుడ్ నటి దీపికా పదుకొనె వంతు వచ్చింది. 
 
దర్శకుడు నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబినేషన్‌లో "ప్రాజెక్టు-కె" పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో దీపికా హీరోయిన్. ఈ చిత్రం షూటింగ్‌లో భాగంగా ఇటీవల హైదరాబాద్ నగరంలో ఓ షెడ్యూల్ కోసం చిత్ర బృందం నగరానికి వచ్చింది. ఆ సమయంలో దీపికా కోసం ప్రభాస్ ప్రత్యేక వంటకాలతో సెట్స్‌కు ఇంటి నుంచి భోజనం తెప్పించారు. దీనికి సంబంధించిన ఫోటోను దీపిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. 
 
సాధారణంగా ప్రభాస్ ఇంట్లో చికెన్, రొయ్యలు, మటన్ వంటి నాన్ వెజ్ వంటకాలు ఘుమఘుమలు వస్తుంటాయి. ఇక అతిథుల కోసం అంటే చెప్పేదేముంది. ప్రభాస్ ఇంటి నుంచి క్యారేజీ వచ్చిందంటో సెట్స్‌లో అందరి దృష్టి ఆ క్యారేజీపైనే ఉంటుంది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరుగడ్డ అనిల్‌కు రాచమర్యాదలకు రూ.5 లక్షలు

రామ్‌గోపాల్ వర్మ సంగతి నన్ను అడిగితే ఎలా? అది హోం శాఖ పరిధిలో వుంది: పవన్ (video)

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments