Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో ప్రభాస్‌కు అమెరికాలో ఆపరేషన్... ఎందుకు?

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2023 (12:05 IST)
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్‌కు అమెరికాలో ఆపరేషన్ జరుగనుంది. దీంతో ఆయన అభిమానాలు ఆందోళన చెందుతున్నారు. తమ హీరో ఎందుకు ఆపరేషన్ చేయించుకుంటున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, నిజానికి ప్రభాస్ ఎప్పటి నుంచో మోకాలి నొప్పితో బాధ పడుతున్నారు. కొన్నాళ్లుగా ఆయన సరిగా నడవలేకపోతున్నారని, పోరాట సన్నివేశాల్లో పాల్గొన్నప్పుడు మరింత ఇబ్బంది పడుతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. 
 
దీనికోసం కొంతకాలం ఆయుర్వేదం చికిత్స కూడా తీసుకున్నారు. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు విదేశాల్లో చికిత్స తీసుకున్నప్పటికీ అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగించిందట. అందుకే శాశ్వత పరిష్కారం కోసం ఆపరేషన్ చేయించుకోవాలని భావిస్తున్నారు. అందుకోసం త్వరలోనే ప్రభాస్ అమెరికా వెళ్లబోతున్నారని తెలుస్తోంది. 
 
ఈ ఆపరేషన్ చేయించుకొంటే కనీసం 3 నెలల విశ్రాంతి తప్పని సరి. అందుకే చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేసి, అప్పుడు సర్జరీ కోసం అమెరికాకు వెళ్లాలని ఆయన భావిస్తున్నారు. ప్రభాస్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల్లో 'సలార్', 'కల్కి' ఉన్నాయి. ఈ అక్టోబరులోగా ఈ రెండు చిత్రాలకు సంబంధించిన షూటింగులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. 
 
ఆ తర్వాత ప్రభాస్ ఆపరేషన్ చేయించుకొని, మూడు నెలలు విశ్రాంతి తీసుకొంటే, 2024 ప్రధమార్థంలో మళ్లీ షూటింగులతో బిజీ అవుతారు. ప్రభాస్ కోలుకొన్న తర్వాత మారుతి సినిమాతో పాటుగా, సందీప్ రెడ్డి వంగా చిత్రాన్నీ పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments