Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయనాడ్ బాధితుల కోసం 'బాహుబలి' దానం!!

వరుణ్
బుధవారం, 7 ఆగస్టు 2024 (12:17 IST)
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు, కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సయక చర్యలు చేపట్టేందుకు అనేక మంది దాతలు ముందుకు వచ్చిన తమవంతుగా విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్, మోహన్ లాల్, చియాన్ విక్రమ్, సూర్య - జ్యోతిక దంపతులు, హీరో కార్తి, కమల్ హాసన్, నయనతార - విఘ్నేశ్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాజిల్ ఇలా అనేక మంది విరాళాలు ఇచ్చారు. 
 
తాజాగా టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ భారీ విరాళం ఇచ్చారు. కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్ల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. వయనాడ్ జిల్లాలో సంభవించిన ప్రకృతి విపత్తును దృష్టిలో ఉంచుకుని ఈ విరాళం ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. జూలై 30వ తేదీన కురిసిన కుంభవృష్టితో వయనాడ్ జిల్లా అతలాకుతలమైన విషయం విషయం తెల్సిందే. కొండ చరియలు విరిగిపడి దాదాపు 300 మందికి పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ఆచూకీ తెలియలేదు. ఈ బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments