Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైట్స్‌లో బాహుబలినే కంటిన్యూ చేస్తా: స్పీడ్ పెంచిన ప్రభాస్

బాహుబలిలో భారీ యాక్షన్ ఘట్టాలతో భళారే అనిపించిన ప్రభాస్.. అదే రేంజ్‌లో తన నెక్ట్స్ మూవీలోనూ ప్రతాపం చూపించేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టాడట డైరెక్టర్ సుజిత్. అందుకే హాలీవుడ్‌లో ట్రాన్స్‌ఫార్మర్స్ వంటి భార

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (06:00 IST)
బాహుబలిలో భారీ యాక్షన్ ఘట్టాలతో భళారే అనిపించిన ప్రభాస్.. అదే రేంజ్‌లో తన నెక్ట్స్ మూవీలోనూ ప్రతాపం చూపించేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టాడట డైరెక్టర్ సుజిత్. అందుకే హాలీవుడ్‌లో ట్రాన్స్‌ఫార్మర్స్ వంటి భారీ సినిమాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన కెన్నీ బేట్స్‌ను సినిమా కోసం రంగంలోకి దింపాడట సుజీత్. ఇప్పుడు ఆ భారీ ఫైట్ల కోసమే బేట్స్ ఆధ్వర్యంలో కసరత్తులు చేస్తున్నాడట ప్రభాస్. 
ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి-2 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా అలా విడుదలకు ముస్తాబు అవుతుండగానే.. తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు యంగ్ రెబెల్ స్టార్. సుజీత్ డైరెక్షన్‌లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సుజీత్ సినిమాకు హాలీవుడ్ ఫైట్ మాస్టర్‌ను ఎంపిక చేశారట. ఎన్టీఆర్ సినిమాకు కూడా రీసెంట్‌గా ఓ హాలీవుడ్ టెక్నీషియన్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. 
 
యూవీ క్రియేషన్స్ బానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. బాహుబలితో ప్రభాస్‌కు వచ్చిన క్రేజ్ దృష్ట్యా.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకే సారి ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. కాగా, బాహుబలి-2 సినిమా విడుదలతో పాటే ఈ సినిమా టీజర్‌ను కూడా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉచిత విమానం వద్దనడానికి నేనేమైనా మూర్ఖుడునా? : డోనాల్డ్ ట్రంప్

ఐదేళ్ల బాలిక కారులోనే ప్రాణాలు కోల్పోయింది.. బొమ్మలు కొనివ్వలేదని..?

కొడాలి నాని నమ్మకద్రోహి.. అసమర్థుడు : వైకాపా నేత ఖాసీ ఆరోపణలు

పెద్దరెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులుకు ఆదేశం : డిప్యూటీ సీఎం పవన్

Narayana: రాజధాని అభివృద్ధికి అదనంగా 10వేల ఎకరాలు అవసరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments