Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ ఖాన్ దాదాల నడ్డి విరగొట్టిన బాహుబలి2... షారుక్ ఖానే గాలికెగిరిపోయాడు

బాహుబలి ఒక్కరోజులో భారతీయ చలన చిత్ర రంగ రికార్డులను తుడిచిపెట్టేసింది. ఆ ఝంఝామారుతం ధాటికి బలైన మొట్టమొదటి దిగ్గజం షారుక్ ఖాన్, బాలీవుడ్ బాద్‌షా రికార్డు గాలికెగిరిపోయింది. ఇక అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఆ ఖాన్ ఈ ఖాన్ అని చెప్పపనిలేదు ముంబ

Webdunia
శనివారం, 18 మార్చి 2017 (09:04 IST)
బాహుబలి ఒక్కరోజులో భారతీయ చలన చిత్ర రంగ రికార్డులను తుడిచిపెట్టేసింది. ఆ ఝంఝామారుతం ధాటికి బలైన మొట్టమొదటి దిగ్గజం షారుక్ ఖాన్, బాలీవుడ్ బాద్‌షా రికార్డు గాలికెగిరిపోయింది. ఇక అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఆ ఖాన్ ఈ ఖాన్ అని చెప్పపనిలేదు ముంబై చిత్ర రికార్డులన్నింటినీ అరేబియా సముద్రంలో కలిపేసింది. జాతీయ సినిమాకుండే రేంజ్‌ను ప్రాంతీయ చిత్రం తోసిరాజంది. ఏ స్థాయిలో అంటే సమీప భవిష్యత్తులో తన రికార్డును ఎవరూ సాధించలేనంత. సమస్త భాషల నటీనటులూ ఈర్ష్యతో, భయంతో, షాక్‌తో కంపించిపోయే రికార్డు అది. ఆ రికార్డు లక్ష్యం వెయ్యి కోట్లు కాదు 1,500 కోట్ల వసూళ్లు అని తెలిస్తే మన గుండె ఆగిపోతుంది.
 
విడుదలై దాదాపుగా 48 గంటలు గడుస్తున్నప్పటికీ యూ ట్యూబ్ లో ‘బాహుబలి 2’ ట్రైలర్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. మొత్తం నాలుగు భాషల్లో విడుదల కాగా, తెలుగు ట్రైలర్ మాత్రం ఎన్నడూ చవిచూడని రికార్డులను సొంతం చేసుకుంది. ఎంతగా అంటే… బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ రికార్డులనే కొల్లగొట్టేటంత! అవును… ఇప్పటివరకు యూ ట్యూబ్ లో అత్యధిక క్లిక్స్ అందుకున్న షారుక్ ‘రాయిస్’ సినిమా రికార్డులను ప్రభాస్ ‘బాహుబలి 2’ అధిగమించి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. 
 
హిందీలో విడుదలైన షారుక్ ‘రాయిస్’ సినిమా ట్రైలర్ 24 గంటలలో 20.2 మిలియన్ క్లిక్స్ ను సొంతం చేసుకోగా, ప్రభాస్ ‘బాహుబలి 2’ ట్రైలర్ దాదాపుగా 22 మిలియన్ క్లిక్స్ ను అందుకుంది. ఒక జాతీయ సినిమాకుండే రేంజ్, మార్కెట్ ఏంటో అందరికీ తెలిసిందే, అలాగే ఒక ప్రాంతీయ భాష చిత్రానికి ఉండే రేంజ్ కూడా చెప్పనవసరం లేదు. కానీ, ‘బహుబలి’ వీటన్నింటికి అతీతం అని చెప్పకనే చెప్తోంది. ఇప్పటివరకు 5 లక్షల లైక్స్ అందుకుని, అందులోనూ తారాస్థాయిలో దూసుకుపోతోంది ‘బాహుబలి 2.’
 
ఇటీవలి కాలంలో ఒక రోజు క్లిక్స్ విషయంలో బాహుబలి రికార్డుకు దరిదాపుగా వచ్చిన సినిమా ఏదైనా ఉందా అంటే షారుక్ ఖాన్ రాయీస్ ట్రైలర్‌నే చూపాలి. కొన్ని నెలల క్రితం విడుదలైన రాయీస్ ఒక రోజులో 20 మిలియన్ ట్రయిలర్ హిట్లను సాదించి ప్రపంచ సినిమాల్లోనే 19వ స్థానం సాధించగా, బాహుబలి 2 ట్రయిలర్ ఒకరోజులో 5 కోట్ల హిట్లను (50 మిలియన్లు) సాధించింది 11వ స్థానంలో నిలిచింది.
 
ఈ జాబితాలో “బాహుబలి 2” ఏకంగా టాప్ 11 స్థానాన్ని ఆక్రమించడం విశేషం. తొలి 10 స్థానాలలో హాలీవుడ్ సినిమాలు నిలువగా, ఆ తర్వాత 11వ స్థానంలో 50 మిలియన్ (నాలుగు భాషలలో 5 కోట్ల క్లిక్స్) అందుకుని “బాహుబలి 2” సత్తా చాటింది. ఇలాంటి అరుదైన ఫీట్ ను అందుకోవడం నిజంగా తెలుగు సినిమాకు గర్వకారణంగా చెప్పాలి. 
 
ఒక్క తెలుగు భాషకు సంబంధించే ఈ రికార్డు సాధించకపోయినా, “బాహుబలి” సృష్టికర్త మన తెలుగు వారే కదా! భవిష్యత్తులో తెలుగు సినిమాకు మరిన్ని మంచి రోజులు రాబోతున్నాయన్న సంకేతాలు కనపడుతున్నాయి.
 
ఇక యూట్యూబ్ విషయానికి వస్తే బాహుబలి2 దిగ్భ్రాంతి పరుస్తోంది. 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగానే అత్యధికంగా వీక్షించిన ట్రయిలర్లలో బాబుబలి2-  మొత్తంమీద 7వ స్థానం సంపాదించింది. తెలుగులో, బాలివుడ్‌లో, యూట్యూబ్‌లో ఈ సంచలన విజయం చిత్ర దర్శకుడు రాజమౌళి, ఆయన టీమ్‌ని ఉబ్బితబ్బిబ్బయేలా చేస్తోంది. 
 
కొన్ని రికార్డులను ఛేదించవచ్చని వారనుకున్నారు కాని చలనచిత్ర రికార్డులను తుడిచిపెట్టే స్థాయి సినిమా తమ కళ్లముందు, తమ చేతులతో నిర్మించబడిందన్న భావన వారిని పరవశింపచేస్తోంది. మరోవైపు బాహుబలి ప్రతిధ్వని దేశమంతటా ఇంకా వినిపిస్తూనే ఉంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sandhya Theatre stampede: రేవంత్ రెడ్డి కామెంట్లతో ఏకీభవిస్తా, బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

చెక్క పెట్టెలో శవం.. వీడని మర్డర్ మిస్టరీ!

దోపిడీ పెళ్లి కుమార్తె : సెటిల్మెంట్ల రూపంలో రూ.1.25 కోట్లు వసూలు!

అల్లు అర్జున్ పైన ఆ కేసుతో 10 ఏళ్లు జైలు శిక్ష పడొచ్చు: సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ

మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపు... కీలక శాఖలన్నీ సీఎం వద్దే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments