Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావణాసురుడుగా ప్రభాస్... సీతగా దీపికా... రాముడుగా హృతిక్ (Video)

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (15:46 IST)
'బాహుబలి' చిత్రంతో అంతర్జాతీయ హీరోగా మారిపోయిన టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్... ఇటీవల 'సాహో'గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అయితే, కలెక్షన్ల పరంగా ఔరా అనిపించింది. కానీ, అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. 
 
ఈ నేపథ్యంలో ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్టులో రావణాసురుడుగా కనిపించనున్నారట. ఇందులో సీత పాత్రను దీపికా పదుకొనె చేయనున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. రామాయణ కథతో ప్రముఖ దర్శకుడు నితేశ్‌ తివారీ తెరకెక్కించబోతున్నారు. 
 
ఈ ప్రాజెక్టును రూ.600 కోట్ల వ్యయంతో మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారట. ఇందులో బలమైన రావణుడి పాత్ర కోసం ప్రభాస్‌ను చిత్రబృందం సంప్రదించినట్టు సమాచారం. అయితే, ఇప్పటివరకు ప్రభాస్‌ ఈ సినిమాకు ఓకే చెప్పలేదని, ఆయన టీమ్‌ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు టేకాప్‌ చేయొచ్చా లేదా? అన్నది బేరిజువేసే పనిలో ఉందని పింక్‌విల్లా వెబ్‌సైట్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. 
 
కాగా, ఈ ప్రాజెక్టును ఏకకాలంలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్నారు. ప్రభాస్‌కు ఉన్న దేశవ్యాప్త స్టార్‌డమ్‌తోపాటు హైట్‌, పర్సనాలిటీపరంగా రావణుడి పాత్రకు సరిగ్గా సూటయ్యే లక్షణాలు ఉండటంతో ఆయనను ఈ సినిమా కోసం తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ప్రభాస్‌ రావణుడి పాత్రను చేస్తే.. ఆ పాత్రకు న్యాయం చేయడమేకాకుండా ప్రజల్లో మరింత హైప్‌ వచ్చే అవకాశముంటుందన్నది చిత్ర యూనిట్ భావన. 
 
మరోవైపు రాముడిగా హృతిక్‌ రోషన్‌, సీతగా దీపికా పదుకొణె నటించే అవకాశముండటంతో వారికి ధీటుగా రావణుడి పాత్రలో ప్రభాస్‌ అలరించే అవకాశముంటని బాలీవుడ్‌ వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో సీతారాములుగా హృతిక్‌, దీపిక నటించనున్నారని కథనాలు రాగా.. ఇంకా ఈ సినిమా కోసం క్యాస్టింగ్‌ ఫైనల్‌ చేయలేదని ఈ వార్తలను దర్శకుడు నితేశ్‌ కొట్టిపారేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2024 : ఆ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే...

పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు.. ప్రమాదం ముంగిట తీర ప్రాంతాలు!

కారు యజమానిని వణికించిన కాకులు - వీడియో వైరల్

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments