Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతులు వెనక్కి విరిచి కట్టేశాం.. ముఖం ముందు ఉరితాడు వేలాడుతోంది.. ఏంటిరా? ఆ ధైర్యం.. 'సైరా' డైలాగ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "సైరా నరసింహా రెడ్డి". సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈన

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (12:21 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "సైరా నరసింహా రెడ్డి". సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈనెల 21వ తేదీన చిరంజీవి పుట్టినరోజును పున‌స్క‌రించుకొని రిలీజ్ చేశారు.
 
ఈ టీజర్ సోష‌ల్ మీడియాలో పెను సునామీనే సృష్టించింది. కేవ‌లం 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 12 మిలియ‌న్ డిజ‌ట‌ల్ వ్యూస్ సాధించి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క టీజ‌ర్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఓ పవర్‌ఫుల్ డైలాగ్‌ను ఆ చిత్ర స్క్రిప్టు రైటర్ పరుచూరి బ్రదర్స్‌లలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ లీక్ చేశారు. తాజాగా ప‌ర‌చూరి గోపాల‌కృష్ణ ప‌ర‌చూరి ప‌లుకులు అనే కార్య‌క్ర‌మంలో ప‌వ‌ర్‌ఫుల్ డైలాగు గురించి చెప్పారు. 
 
'చేతులు వెనక్కి విరిచి కట్టేశాం. ముఖం ముందు ఉరితాడు వేలాడుతోంది. ఏంటిరా? ఆ ధైర్యం.. చావు భయం లేదా నీకు?' అని అంటే 'చచ్చి పుట్టినవాడిని.. చనిపోయిన తర్వాత కూడా బతికే వాడిని చావంటే నాకెందుకురా భయం' అనే డైలాగ్ చెప్పారు. ఈ డైలాగ్ మెగా అభిమానుల‌లో జోష్ నింప‌డం ఖాయం అని అంటున్నారు. 
 
12 ఏళ్ళ త‌ర్వాత ప‌ర‌చూరి బ్ర‌ద‌ర్స్ సైరా చిత్రానికి క‌థ అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో వారు రోమాలు నిక్క పొడుచుకునేలా డైలాగులు రాస్తున్నారు. అలాగే, బుర్రా సాయి మాధ‌వ్ కూడా సైరా కోసం మరికొన్ని పవర్‌ఫుల్ డైలాగులు రాస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments