Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్‌ అనారోగ్యానికి సోదరుడే కారణమా?: శేఖర్ అంటించిన పోస్టర్లకు అర్థమేమిటి..?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో చికిత్స తీసుకుంటున్న రజనీకాంత్‌కు ఏమైంది ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దానిపై అభిమానులు ఆరా తీస్తున్నారు. రజనీకా

Webdunia
సోమవారం, 27 జూన్ 2016 (17:24 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో చికిత్స తీసుకుంటున్న రజనీకాంత్‌కు ఏమైంది ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దానిపై అభిమానులు ఆరా తీస్తున్నారు. రజనీకాంత్ ఆరోగ్య విషయంపై ఆయన కుటుంబ సభ్యులు సైతం నోరువిప్పలేదు.

ఈ నేపథ్యంలో తమిళనాడులో మధురై జిల్లా రజినీకాంత్ అభిమానుల సంఘం సభ్యుడు శేఖర్ మదురైలో అంటించిన పోస్టర్లు కొత్త వివాదానికి దారి తీశాయి. రజనీకాంత్ ఆరోగ్యం దెబ్బతినేందుకు ఆయన సోదరుడే కారణమంటూ శేఖర్ ఆ పోస్టర్లు కొట్టించి.. అక్కడక్కడా అంటించేయడంతో.. రజినీ అభిమానులే ఈ పోస్టర్లపై ఫైర్ అయ్యేలా వ్యవహారం మళ్లింది. 
 
రజినీ సోదరుడు సత్యానారాయణపై శేఖర్ ఆ పోస్టర్లలో దుమ్మెత్తిపోశాడు. రజనీకాంత్ నటించిన కొచ్చాడియన్, లింగా సినిమాలు పరాజయం పాలవడానికి.. రజినీకాంత్ ఆరోగ్యం దెబ్బతినడానికి ఆయన సోదరుడు సత్యనారాయణే కారణమని ఈ పోస్టర్లో విమర్శలు గుప్పించాడు.

అంతేగాకుండా గత ఏడాది ఏప్రిల్‌లో చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో రజినీ క్షేమం కోరుతూ తాను ఓ విషయాన్ని సత్యనారాయణకు చెప్పానని.. కానీ అతను రజనీ కుటుంబ సభ్యుల దృష్టికి ఆ విషయం తీసుకెళ్లలేదని.. అందువల్లే ప్రస్తుతం రజినీ ఇబ్బంది పడుతున్నాడని శేఖర్ ఆరోపించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
అప్పుడు జరిగిన తప్పుకు తాను మధురై మీనాక్షి దేవాలయంలో పరిహారం కూడా చెల్లించనున్నట్లు శేఖర్ వెల్లడించాడు. కానీ సత్యనారాయణపై శేఖర్ విమర్శలు గుప్పించడంతో పాటు.. రజనీ సోదరుడితో శేఖర్ ఏం చెప్పాడు అనే దానిపై కోలీవుడ్‌లో చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే సత్యనారాయణపై ఆరోపణలు చేసిన శేఖర్‌పై కేసు నమోదైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments