Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడా.. దేవుడా.. మాయదారి దేవుడా.. ఆ ముగ్గురిలో నాకు జగన్ అంటే ఇష్టం: పోసాని

ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తుల్లో ప్రముఖ నటుడు పోసాని కూడా ఒకరు. గతంలో ప్రజారాజ్యం తరపున ఎన్నికల బరిలో దిగి భంగపడిన పోసాని.. మళ్లీ సినిమాలపైనే దృష్టి పెట్టారు. ఇటీవల నేను లోకల్ సినిమాలో నానికి తండ్రిగ

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (09:31 IST)
ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తుల్లో ప్రముఖ నటుడు పోసాని కూడా ఒకరు. గతంలో ప్రజారాజ్యం తరపున ఎన్నికల బరిలో దిగి భంగపడిన పోసాని.. మళ్లీ సినిమాలపైనే దృష్టి పెట్టారు. ఇటీవల నేను లోకల్ సినిమాలో నానికి తండ్రిగా కీలక పాత్ర పోషించిన పోసాని ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అడపాదడపా రాజకీయాల గురించి కూడా ప్రస్తావించారు. ఆ మధ్య ఓ టీవీ ఛానెల్ రాజకీయ చర్చలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌పై ఆయన మాట తూలడం తీవ్ర వివాదస్పదమైంది.
 
ఈ నేపథ్యంలో ఏపీ పాలిటిక్స్‌కు సంబంధించి పోసాని ఆసక్తికర కామెంట్ చేశారు. చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్.. ఈ ముగ్గురిలో ఏపీకి ఎవరైతే బెటర్? అన్నప్రశ్నకు 'జగన్' అని సమాధానం చెప్పేశారు పోసాని. 'దేవుడా.. దేవుడా.. మాయదారి దేవుడా.. ఈ ముగ్గురిలో నాకు జగన్ అంటే ఇష్టం' అని బదులిచ్చారు. 
 
మోడీ జపం చేస్తున్నారే భయంతోనా? లేకుంటే నల్లధనం దాచుకున్నారా? అని పోసానిని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. 'పోసాని కృష్ణ మురళీకి ఈ రోజు ఏం కావాలి చెప్పండి? నేను బీజేపీ మెంబర్ కూడా కాదు' అన్నారు. బ్లాక్ మనీ ఉంటే తీసుకెళ్లండి.. ఐటీ వాళ్లకి చెప్పండి.. డబ్బుల్లేక మా తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆ పరిస్థితి తనకు రాకూడదని తన బిడ్డలు, తాను సంతోషంగా బతికేందుకు కావాల్సిన డబ్బు సంపాదించుకున్నానని పోసాని చెప్పుకొచ్చారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments