Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసాని కృష్ణ‌ముర‌ళికి బిల్డ‌ప్ బాగా పెరిగింది... నాకు నేనే ఏడ్చానంటున్నాడు...

పోసానికి బిల్డ‌ప్ బాగా పెరిగింది. అందుక‌నే ఈమ‌ధ్య అత‌న్ని బిల్డ‌ప్ కృష్ణ అని పిలుస్తున్నారు. ఏంటి అవునా..? అని ఆలోచిస్తున్నారా..? విష‌యం ఏంటంటే... పోసాని కృష్ణ ముర‌ళి బిల్డ‌ప్ కృష్ణ అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. శ్రావ్య మూవీస్ బ్యానర్‌లో లక్ష్మీ

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (12:42 IST)
పోసానికి బిల్డ‌ప్ బాగా పెరిగింది. అందుక‌నే ఈమ‌ధ్య అత‌న్ని బిల్డ‌ప్ కృష్ణ అని పిలుస్తున్నారు. ఏంటి అవునా..? అని ఆలోచిస్తున్నారా..? విష‌యం ఏంటంటే... పోసాని కృష్ణ ముర‌ళి బిల్డ‌ప్ కృష్ణ అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. శ్రావ్య మూవీస్ బ్యానర్‌లో లక్ష్మీ టాకీస్ సమర్పణలో సరీష్, గీత హీరోహీరోయిన్లుగా పోసాని కృష్ణమురళీ ప్రధానపాత్రలో ‘బిల్డప్ కృష్ణ’ అనే సినిమా రూపొందుతోంది. విన్సెంట్ సెల్వ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళీ మాట్లాడుతూ.. ‘‘బిల్డప్ కృష్ణ. ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలో చేశా. అప్పట్లో ఐదారు ఫ్యామిలీల మధ్యలో కీ పాత్రలో గొల్లపూడి మారుతీరావుగారు ఎలా నటించేవారో.. ఈ సినిమాలో నాది అలాంటి పాత్ర. చాలాకాలం తర్వాత చాలా మంచి పాత్ర వచ్చింది. రెండు కుటుంబాలను ఎలా విడదీయాలి? లేదంటే ఎలా కలపాలి వంటి పాత్రలు మారుతీరావుగారు చేశారు. దర్శకుడు విన్సెంట్ ఇప్పుడు అలాంటి పాత్ర నాకు ఈ సినిమాలో ఇచ్చారు. 
 
రైటర్‌గా ఉన్నప్పుడు కూడా నాకు నేను రాసుకోలేకపోయా. ఎవరికీ ఇలాంటి పాత్ర రాయలేకపోయా. ఈ సినిమాలో నా పాత్ర చూస్తుంటే గొల్లపూడిగారే కనబడతారు. నా పాత్రకి ఈ సినిమాలో చాలా ప్రాధాన్యం ఉంటుంది. అందుకే టైటిల్ కూడా ‘బిల్డప్ కృష్ణ’ అని పెట్టడం జరిగింది అని చెప్పారు. 
 
ఇప్పటి వరకు ఎన్నో పాత్రలు చేశాను. నవ్వించాను. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాను. కానీ ఇందులో ట్రాజెడీ తరహాలో పెద్దపెద్దగా ఏడ్చే పాత్రలో చేశా. ఈ సినిమాలో ఇలాంటి సీన్లు చాలా ఉన్నాయి. ఆ సీన్లు చూసిన తర్వాత నాకు నేనే కన్నీళ్లు పెట్టుకున్నా. ఈ సినిమా చూసేటప్పుడు మీకు కూడా కన్నీళ్లు వస్తాయి. అంత మంచి సీన్స్ నాకు డైరెక్టర్‌గారు ఈ సినిమాలో ఇచ్చారు. 
 
నాలో ఎంత దమ్ము ఉంది అనేది ఈ సినిమాలో చూపించే అవకాశం ఇచ్చాడు. నా పాత్రే కాదు.. సినిమా కథ కూడా ప్రాక్టికల్‌గా, సహజంగా, లవ్‌బుల్‌గా ఉంటుంది. ఒక మగాడు తప్పు చేయడానికి ఈ సొసైటీలో ఎలాంటి వాతావరణం ఉందో.. అలాగే ఓ ఆడది రాంగ్ రూట్‌లో వెళ్లడానికి ఈ సొసైటీలో ఉన్న కారణాలను చాలా సహజంగా ఇందులో చూపించారు. ఒక రైటర్‌గా నాకు ఈ కథ చాలా బాగా నచ్చింది. అందుకే ఇలా చెప్పగలుగుతున్నా. నేను ప్రేమించి ఈ సినిమా చేశా. నాకు చాలా మంచి పేరు వస్తుందని పూర్తిగా నమ్ముతున్నా. అందుకే ప్రెస్‌మీట్ కూడా మా ఇంటిలోనే పెట్టమని చెప్పా.. అందరూ ఈ సినిమా చూడండి. కొత్త పోసానిని చూస్తారు అని అన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments