తెలుగుదేశం మీ పార్టీ.. రాజకీయంగా ఎమ్మెల్యే కావాలి... ఎవరన్నారు?

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం ఎమ్మెల్యే. ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమం మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (16:34 IST)
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం ఎమ్మెల్యే. ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమం మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇలాంటి వారిలో నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఒకరు. ఈయన మాట్లాడుతూ, చలన వ్యాఖ్యలు చేశారు. 
 
'చాలా మంది హీరోలవుతారు. వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారు. వాళ్ళు మాత్రమే సంపాదించుకుంటారు. దీనికి హరికృష్ణ, కల్యాణ్‌రామ్‌లు భిన్నం. అందుకని, కల్యాణ్‌రామ్‌ హీరోగా సక్సెస్‌ కావాలి. ఇది అసందర్భమైనా ఒక్క మాట చెబుతా... కల్యాణ్‌రామ్‌ మంచి లక్షణాలున్న అబ్బాయి(ఎమ్మెల్యే) అవ్వడం కంటే, రాజకీయంగా ఎమ్మెల్యే అయితే నాకిష్టం. 
 
నువ్వు (కల్యాణ్‌రామ్‌), మీ కుటుంబమైనా రాజకీయంలోకి రావాలని, ఉండాలని ఎందుకు అంటానంటే.. తెలుగుదేశం పార్టీ మీది. రామారావుగారి కుటుంబం నుంచి నీలాంటివాడు వస్తే ప్రజలు బాగుపడతారు. సమాజం బాగుపడుతుంది'  వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఆ కార్యక్రమంలో కలకలం రేగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కాలుష్యానికి చెక్.. పవన్ పక్కా ప్లాన్

తనకంటే అందంగా ఉన్నారని అసూయ.. ముగ్గురు బాలికలను చంపేసిన కిరాతక లేడీ

అనకాపల్లిలో 480 ఎకరాల భూమిలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌

ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి.. 28 ఏళ్ల వ్యక్తికి కడప పోస్కో కోర్టు జీవిత ఖైదు

బలహీనపడిన వాయుగుండం... మరో రెండు రోజులు వర్షాలే వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments