Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిపైసాకి లెక్కలు చూపిస్తారా రాజా? మీకో న్యాయం మాకో న్యాయమా?: పోసాని

నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మూడు రోజుల తర్వాత విశ్వరూపం చూపిస్తామని ప్రతిపక్షాలన్ని కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశాయి. పార్లమెంట్ ఉభయ సభల్లోను దీనిపై వాడివేడి చర్చ జరగ్గా.. ప్రతిపక్షా

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (09:27 IST)
నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మూడు రోజుల తర్వాత విశ్వరూపం చూపిస్తామని ప్రతిపక్షాలన్ని కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశాయి. పార్లమెంట్ ఉభయ సభల్లోను దీనిపై వాడివేడి చర్చ జరగ్గా.. ప్రతిపక్షాలన్ని ఈ చర్యను నిరసిస్తూ రోడ్డెక్కాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం నేత సీతారాం ఏచూరి దీనిపై గట్టిగా పోరాడడానికి సన్నద్దమవుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల మార్పిడిపై సినీ రచయిత పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు. పెద్ద నోట్ల మార్పిడి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోసాని స్పందించారు. నల్లధనాన్ని నిర్మూలించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు చేసిన తర్వాత పోసాని మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు డబ్బులు వినియోగించాలి. దేశ ప్రజలు మాత్రం చెక్కులివ్వాలా? అంటూ ప్రశ్నించారు. బహిరంగ సభలు పెట్టాలంటే.. రోడ్లు, కూడళ్లు నిండిపోయేలా హోర్డింగులు పెట్టడానికి.. ఎన్నికల్లో డబ్బు పంచడామనికి కోట్లు కావాలి. వాటికి లెక్కెక్కడ అంటూ అడిగారు. 
 
ఆధారాలు చూపే పత్రాలు ఇవ్వాలన్నారు. కొంత మొత్తమే అకౌంట్లో ఉంచుకోవాలి. పూర్‌గా, ఫెయిర్‌గా ఉండాలి. ట్రా‌న్స్‌పరెంట్‌గా చూపించాలి. ఇదెక్కడి న్యాయం రాజా? మీకొక రూల్, మాకొక రూలా? మీరు మీ పార్టీలు కూడా ఇకపై ప్రతిపైసాకి లెక్కలు చూపిస్తారా రాజా? అంటూ మండిపడ్డారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments