Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 వారాల క్రితం పెళ్లి... శారీరకంగా వేధిస్తున్నాడంటూ భర్తపై పూనమ్ ఫిర్యాదు.. (video)

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (09:38 IST)
బాలీవుడ్ వివాదాస్ప నటీమణుల్లో పూనమ్ పాండే ఒకరు. ఈమె బాలీవుడ్ సెక్సీబాంబ్ కూడా. ఈమె రెండు వారాల క్రితం బాలీవుడ్ నిర్మాత శ్యామ్ బాంబేను వివాహం చేసుకుంది. ఇంతలోనే భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా హింసిస్తున్నాడంటూ గోవా పోలీసులకు ఇచ్చిన ఓ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం శ్యామ్‌ను అరెస్ట్ చేయగా, రూ.20 వేల పూచీకత్తుపై స్థానిక కోర్టు అతడికి బెయిలు మంజూరు చేసింది.
 
వివాహమై రెండు వారాలు కూడా కాకముందే బాలీవుడ్ నటి పూనమ్ పాండే తన భర్త, నిర్మాత శ్యామ్ బాంబేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా హింసిస్తున్నాడని గోవా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 
 
గత యేడాది జూలై నెలలో పూనమ్ పాండే ఓ ప్రకటన చేసింది. నిర్మాత శ్యామ్ బాంబేను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. ఆ ప్రకారంగానే ఈ యేడాది గత జూన్ నెలలో వారిద్దరూ ఓ ఇంటివారయ్యారు. నిశ్చితార్థం చేసుకున్న ఉంగరాలను చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. 
 
ఈ నెల (సెప్టెంబరు) 10వ తేదీన శ్యామ్‌తో వివాహమైనట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. పెళ్లి ఫొటోలను షేర్ చేసింది. తాజాగా, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి హనీమూన్ టూర్‌కు కూడా వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇంతలో ఏమైందో కానీ భర్త తనను హింసిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments