Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పూజ' కోసం పడరానిపాట్లు - ఐదు రోజులు ఫుట్‌పాత్‌పైనే పడిగాపులు

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (13:28 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఉన్న పూజా హెగ్డేకు అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఆమె నటిస్తున్న చిత్రాలు సూపర్ డూపర్‌హిట్స్ అవుతున్నాయి. ఈ సంక్రాంతికి కూడా అలా వైకుంఠపురములో చిత్రంలో సందడి చేస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది. తాజాగా ఓ వీరాభిమాని తన అభిమాన హీరోయిన్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఏకంగా ఐదు రోజుల పాటు ఫుట్‌పాత్‌పై పడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను పూజా హగ్డేనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పూజా హెగ్డేకు భాస్కర్ రావు అనే వీరాభిమాని. తన అభిమాన హీరోయిన్‌ను ప్రత్యక్షంగా చూడాలని ఆకాంక్షించాడు. అంతే... ఎవరికీ చెప్పాపెట్టకుండా ముంబైకు వెళ్లిపయాడు. ఎలాగైనా పూజాను కలవాలని కంకణం కట్టుకున్నాడు. ఇందుకోసం ముంబైకు చేరుకున్న భాస్కర రావు.. ఏకంగా ఐదు రోజులు రోడ్డుపైనే పడిగాపులు కాచాడు. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయలేదు. రాత్రిపూట ఫుట్‌పాత్‌లపైనే పడుకున్నారు. 
 
ఈ విషయం పూజాకు చేరింది. దీంతో ఆమె స్వయంగా భాస్కర్ రావు వద్దకు వెళ్లింది. "నీ వీరాభిమానం నా మనస్సును తాకింది. కానీ నా అభిమాని నా కోసం ఇలా రోడ్లపై ఉంటూ, నిద్రపోవడం సరికాదు. నన్ను కలిసేందుకు ఇంత కష్టపడటం చాలా బాధగా అనిపిస్తోంది. నువ్వు ఎక్కుడున్నా.. నీ ప్రేమను ఫీలవుతా.. నీకు హామీనిస్తున్నా.. ఫ్యాన్సే నా బలం.. ప్రేమతో" అంటూ బాధపడుతన్న ఎమోజీలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ తర్వాత భాస్కర్ రావుకు షేక్ హ్యాండ్ ఇచ్చిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‍లో షేర్ చేసింది. 


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Bhaskar Rao thank you for coming all the way to Bombay and waiting for 5 days to see me. I am so touched but it also saddens me to see my fans going through so much trouble to do so.I would NEVER want to see you’ll sleeping on the road in order to do so.I promise you, I feel your love from wherever u’ll are, you’ll are my strength. LOVE YOU’LL. #bestfansever #touched #grateful

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మానవత్వం మంటగలిసిపోయింది.. ట్రక్ డ్రైవర్ గాయపడితే.. ఫోన్, డబ్బు దొంగలించేశారు.. (video)

ఇద్దరితో వివాహం, మరో ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసిన నగల వ్యాపారి

ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారా.. విమానాలు నడుపుతున్నారా? బస్సు మధ్యలో వ్యక్తి.. ఏమైంది? (video)

Vijay Sai Reddy : విజయసాయిరెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు.. హాజరవుతారో? లేదో?

జనవరి 8న నరేంద్ర మోదీ పర్యటన- సర్వం సిద్ధం చేస్తోన్న ఏపీ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments