Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొన్నియిన్ సెల్వ‌న్‌ 2 ట్రైల‌ర్ లాంచ్ మార్చి 29న చెన్నైలో

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (13:27 IST)
Ponniin Selvan 2
ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ఆవిష్క‌రిస్తోన్న విజువ‌ల్ వండ‌ర్ `పొన్నియిన్ సెల్వ‌న్ 2`. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్స్‌పై సుభాస్క‌ర‌న్‌, మ‌ణిర‌త్నం ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. గ‌త ఏడాది సెన్సేష‌న‌ల్ హిట్ అయిన హిస్టారిక‌ల్ మూవీ పొన్నియిన్ సెల్వ‌న్ 1కి కొన‌సాగింపుగా పొన్నియిన్ సెల్వ‌న్ 2 తెర‌కెక్కుతోంది. రెండో భాగంపై హై ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. ఏప్రిల్ 28న వ‌ర‌ల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా మూవీగా తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో `పొన్నియిన్ సెల్వ‌న్ 2` విడుద‌ల‌వుతుంది.
 
ప్రేమ‌, ప‌గ‌, ప్ర‌తీకారం, రాజ‌కీయం, రాజ్యాధికారం, వీర‌త్వం..వంటి అంశాల చుట్టూ తిరిగే హిస్టారిక‌ల్ మూవీ కోసం అందరూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన బి.టి.ఎస్ వీడియో, ఆగ‌నందే పాట‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ మూవీ ట్రైల‌ర్‌, ఆడియో లాంచ్‌ను చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మార్చి 29న ఘ‌నంగా జ‌రగ‌నుంది. చిత్ర యూనిట్ స‌హా ప‌లువురు స్టార్స్ ఈ వేడుక‌కి హాజ‌రు కాబోతున్నారు.
 
అత్య‌ద్భుత‌మైన కోట‌లు, అంత‌కు మించిన క‌థ‌, క‌థ‌నం, అందులో రాజతంత్రం, ఒక‌రికి ముగ్గురు హీరోలు, స్క్రీన్ నిండుగా హీరోయిన్లు అంటూ వేరే లెవ‌ల్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో తెర‌కెక్కుతోంది పొన్నియిన్ సెల్వ‌న్‌2. విక్ర‌మ్, జ‌యం ర‌వి, కార్తి, ఐశ్వ‌ర్యారాయ్‌, త్రిష‌, జ‌య‌రామ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఏప్రిల్ 28న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ పాన్ ఇండియా మూవీ త‌మిళ్‌ తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments