Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిక్కుల్లో హైపర్ ఆది : ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (15:58 IST)
ప్రముఖ టీవీలో ప్రసారమయ్యే కామెడీ షో 'జబర్దస్త్' ఈ షో ద్వారా కమెడియన్‌‌గా గుర్తింపు పొందిన హైపర్ ఆది ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ఆదిపై ఎల్బీనగర్‌ అసిస్టెంట్ పోలీస్ కమిషనరు శ్రీధర్‌ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యులు ఫిర్యాదు చేశారు. అందులో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాషను కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఈ ఫిర్యాదులో ఆది, స్క్రిప్ట్‌ రైటర్‌, మల్లెమాల ప్రొడక్షన్‌ పేర్లను వారు ప్రస్తావించారు. ఫిర్యాదు చేసిన వారిలో తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్, సమాచార హక్కు సాధన స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తీక్, టీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి చింత మహేశ్, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ తదితరులు ఉన్నారు. 
 
గతంలోనూ ఆదిపై మానవహక్కుల సంఘానికి (హెచ్‌ఆర్సీ) ఫిర్యాదులు అందాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా స్కిట్ చేశారని ఆరోపిస్తూ పలువురు అనాథ పిల్లలు, సినీ విమర్శకుడు కత్త మహేష్‌లు హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments