Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్.. అసత్య ప్రచారం చేయొద్దు... ఎస్పీబీ ఆరోగ్యంపై ఎస్పీ చరణ్ క్లారిటీ

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (13:12 IST)
కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు జరిగిపిన కరోనా నిర్ధారణ పరీక్షలో నెగిటివ్ వచ్చినట్టు వార్తలను ఆయన కుమారుడు ఎస్.పి. చరణ్ ఖండించారు. దయచేసి.. అసత్య వార్తలు, రూమర్లు ప్రసారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పైగా, తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఆయన చికిత్స పొందుతున్న ఎంజీఎం ఆస్పత్రి వైద్య వర్గాలు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. 
 
కాగా, తాజాగా ఎస్పీబీకి నిర్వహించిన కరోనా పరీక్షలో నెగెటివ్ ఫలితం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దీంతో ఎస్.పి. చరణ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో తన తండ్రి ఇంకా ఐసీయూ వార్డులోనే ఎక్మో సపోర్టుతో ఉన్నారని, ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. 
 
ఈ నెల 5వ తేదీన కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఎస్.పి బాలు ఆరోగ్యం ఆ తర్వాత మరింతగా క్షీణించిపోయింది. దీంతో ఆయన ప్రస్తుతం ప్రత్యేక ఐసీయూ వార్డులో ఉంచి ఎక్మో సపోర్టుతో చికిత్స అందిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments