Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లా నా మ‌తి చెడగొట్టావే అంటూన్న సంపూర్ణేష్ బాబు

Webdunia
సోమవారం, 24 మే 2021 (15:46 IST)
sampu, maheswari
సంపూర్ణేష్ బాబు హీరోగా కె ఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా బజార్ రౌడీ. ఈసినిమా కి సంబందించి రెండ‌వ సాంగ్ ని విడుద‌ల చేశారు. నీ వంటికి మెరుపులు బాగా చుట్టేశావే..నా కంటికి ఏవో రంగులు చూపించావే..పిల్లా నా మ‌తి చెడ‌గోట్టావే .. వ‌ద్ద‌న్నా న‌ను ప‌డ‌గోట్టావే.. అంటూ సంపూర్ణేష్ బాబు, హీరోయిన్ మ‌హేశ్వ‌రి వ‌ద్దితో డ్యూయ‌ట్ పాడుకుంటున్నాడు. ఈ సాంగ్ కి సోష‌ల్ మీడియాలో ప్ర‌త్యేఖమైన స్పంద‌న వ‌స్తుంది. ప్ర‌స్తుతం పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ద‌ర్శ‌కుడు డి.వసంత నాగేశ్వరరావు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు.
 
శేఖర్ అలవలపాటి నిర్మాణ సారధ్యం లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబందించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, మొద‌టి  రెండు సాంగ్స్‌ కి అద్భుతమైన రెస్పాన్స్ రావ‌టం విశేషం. ఈ చిత్ర టీజ‌ర్ కి 2 మిలియ‌న్ వ్యూస్ ని సోష‌ల్ మీడియాలో సొంతం చేసుకుంది. సంపూర్ణేష్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సీనియర్ రైటర్ మరుధూరి రాజా ఈ సినిమాకు మాటలు రాశారు. ఎడిటర్ గౌతంరాజు బజార్ రౌడీ చిత్రాన్ని చాలా బాగా కుదించారు.  
 
SS ఫ్యాక్టరీ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు ఏ విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. క‌రోనా తీవ్ర‌త త‌గ్గిన వెంట‌నే ఈ బ‌జార్‌ రౌడీ సినిమాను విడుదల చేయడానికి నిర్మాత లు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో నాగినీడు, షియాజిషిండే, పృథ్వి, ష‌ఫి, స‌మీర్‌, మ‌ణిచంద‌న‌, న‌వీన‌,ప‌ద్మావ‌తి, క‌త్తిమ‌హేష్, త‌దిత‌రులు న‌టించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోదీ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments