Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈజిప్టులో ఇద్దరు మైనర్లకు నిశ్చితార్థం.. సర్వత్రా విమర్శలు.. సర్కారు ఏం చేస్తుందో?

బాల్య వివాహాలు మన దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ జరుగుతున్నాయి. ఈజిప్టులో ఇద్దరు మైనర్లకు నిశ్చితార్థం జరగడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఈజిప్టు రాజధాని కైరోకు 75కిలోమీటర్ల దూరంలోని ఓ రాష్ట్రంలో మైనర్లకు

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (13:06 IST)
బాల్య వివాహాలు మన దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ జరుగుతున్నాయి. ఈజిప్టులో ఇద్దరు మైనర్లకు నిశ్చితార్థం జరగడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఈజిప్టు రాజధాని కైరోకు 75కిలోమీటర్ల దూరంలోని ఓ రాష్ట్రంలో మైనర్లకు ఎంగేజ్‌మెంట్ అయ్యింది. వివరాల్లోకి వెళితే కైరోకు 75 కిలోమీటర్ల దూరంలోని ఓ రాష్ట్రంలో నజీర్ హసన్ అనే వ్యక్తి తన పెద్ద కుమారుడు వివాహ వేడుకలు ప్రఖ్యాత గాయకులు, బెల్లీ డ్యాన్సర్ల మధ్య విలాసవంతంగా నిర్వహించాడు. 
 
తన కుమారుడు ఒమర్.. ఘరంను అట్టహాసంగా పెళ్ళి చేసుకోనున్నాడని ప్రకటన చేశాడు. కానీ వారిద్దరూ మైనర్లు కావడం వివాదాస్పదమైంది. మైనర్లకు పెళ్లి నిశ్చయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఒమర్‌కు12 సంవత్సరాలైతే.. ఘరం వయస్సు 11 ఏళ్లే కావడం గమనార్హం. ఈ పెళ్ళిపై ఈజిప్టు మీడియా ఫైర్ అయ్యింది. కానీ ఇది కేవలం నిశ్చితార్థమే కానీ వివాహం కాదని పేర్కొంది. 
 
ఈజిప్ట్ చట్టాల ప్రకారం 18 ఏండ్ల లోపు వివాహాల రిజిస్ట్రేషన్‌పై నిషేధం అమలులో ఉంది. కానీ మైనర్లకు వివాహాలు సాధారణ ప్రక్రియగానే సాగుతోంది. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం ఈజిప్ట్‌లో 17 శాతం బాలికలకు 18 ఏండ్లలోపే వివాహం జరుగుతోంది. ఇదీ కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికం. ఒమర్, ఘరం నిశ్చితార్థంపై బాలల, మహిళల హక్కుల కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ఫిర్యాదులు అందాయి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments