Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైదీకి అభిమాని అరుదైన కానుక... చల్ల చల్లని ఐస్‌తో ఖైదీ టైటిల్ లోగో..

వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'ఖైదీ నంబర్‌ 150' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జనవరి 11న విడుదలైన చిరు ఖైదీ అమెరికాలో మంచి టాక్‌ను తెచ్చుకుంది. దాదాపు 10ఏళ్ల తర్వాత చిరంజీవి

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (17:24 IST)
వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'ఖైదీ నంబర్‌ 150' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జనవరి 11న విడుదలైన చిరు ఖైదీ అమెరికాలో మంచి టాక్‌ను తెచ్చుకుంది. దాదాపు 10ఏళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. 
 
వెండితెరపై చిరంజీవి రీఎంట్రీని చూసి అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ హీరో రామ్‌చరణ్‌కు ఓ అభిమాని అరుదైన కానుక అందించారు. నిర్మాతగా పరిచయమైన 'ఖైదీ నంబర్‌ 150' చిత్రం టైటిల్‌ లోగోను ఐస్‌తో తయారు చేసిచ్చారు. 
 
ఈ విషయాన్ని మెగా తనయుడు రామ్‌చరణ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలుపుతూ.. ఓ లవ్లీ అభిమాని ఈ ఐస్‌ శిల్పాన్ని తయారు చేసిచ్చారని, 'ఖైదీ నంబర్‌ 150' చిత్రం విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నామని తెలిపారు. దీంతోపాటు ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. ఖైదీ సినిమాపై మంచి రివ్యూలను అందుకోవడంతోపాటు చక్కటి వసూళ్లను రాబడుతోంది.
 
మరోవైపు అలనాటి నటి సుహాసిని చిరంజీవికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్‌ చేశారు. 'నా స్నేహితుడు, సహ నటుడికి శుభాకాంక్షలు.. సంతోషంగా, గర్వంగా ఉంది' అంటూ చిరుతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments