Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పుష్ప"కు కాకినాడ పోలీసుల షాక్ - సక్సెస్ పార్టీకి నో పర్మిషన్

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (15:34 IST)
'పుష్ప' చిత్ర బృందానికి కాకినాడ పోలీసులు షాకిచ్చారు. ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్‌ను పురస్కరించుకుని కాకినాడలో భారీ ఎత్తున సక్సెస్ పార్టీ నిర్వహించాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ, ఈ గ్రాండ్ సక్సెస్ పార్టీకి కాకినాడ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 
 
ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షల దిశగా పయనిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి కట్టడిపై ప్రత్యేక దృష్టిసారించింది. 
 
ఈ నేపథ్యంలో పుష్ప సక్సెస్ పార్టీ నిర్వహణకు అనుమతి ఇచ్చేందుకు కాకినాడ పోలీసులు తిరస్కరించారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ స్పష్టం చేసింది. "ఈ రోజు కాకినాడలో జరగాల్సిన "పుష్ప'' మూసీవ్ సక్సెస్ పార్టీ పర్మిషన్ సమస్యల కారణంగా రద్దు అయ్యింది" అంటూ ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

పహల్గామ్ ఉగ్రదాడి : కాశ్మీర్‌కు బుక్కింగ్స్‌ను రద్దు చేసుకుంటున్న టూరిస్టులు!!

ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్‌కు భార్య వీడ్కోలు (Video)

పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments