Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాంత్ అడ్డాల మిక్కీ జె మేయర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం పెదకాపు-1

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (17:39 IST)
Virat Karna, Pragathi
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలకమెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. సెన్సేషనల్  బ్లాక్‌బస్టర్ ‘అఖండ’ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న న్యూ ఏజ్ ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పెదకాపు-1’ వీరిద్దరి కంబినేషన్లో రాబోతుంది.. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ ప్రధాన తారాగణం.
 
‘చనువుగా చూసిన’ ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేసిన మేకర్స్ మ్యూజికల్ జర్నీని ఆరంభించారు. మిక్కీ జె మేయర్ ప్లజంట్  మెలోడీని కంపోజ్ చేసారు. ప్రోమో అందరినీ అలరిస్తుంది. ఆర్కెస్ట్రేషన్, వాయిస్, లిరిక్స్ రొమాంటిక్ నంబర్‌కు తగ్గట్టుగా వున్నాయి. విరాట్ కర్ణ , ప్రగతి శ్రీవాస్తవ ఈ పాటలో అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకున్నారు. విరాట్ కర్ణ రస్టిక్ గెటప్‌లో కూల్‌గా కనిపించగా, ప్రగతి శ్రీవాస్తవ్ సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించారు. పూర్తి పాటను జూలై 27న విడుదల చేయనున్నారు.
 
అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా ఇది. టీజర్‌లో శ్రీకాంత్ అడ్డాల కథ-కథనంలో తన ప్రతిభను చూపించారు. టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది.
 
ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పిస్తున్నారు. ప్రముఖ యాక్షన్ దర్శకుడు పీటర్ హెయిన్స్ ఫైట్స్‌ను పర్యవేక్షించగా రాజు సుందరం కొరియోగ్రాఫర్‌గా  పని చేస్తున్నారు.
 
నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, నాగ బాబు, తనికెళ్ల భరణి, బ్రిగడ సాగ, రాజీవ్ కనకాల, అనుసూయ, ఈశ్వరి రావు, నరేన్ తదితరులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అరిఘాత్‌ నుండి కే-4 క్షిపణి ప్రయోగం విజయవంతం

టాయిలెట్‌ పిట్‌లో ఇరుక్కుపోయిన నవజాత శిశువు మృతదేహం.. ఎక్కడ?

ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్‌కు ఇంకా బుద్ధిరాలేదు : మంత్రి సత్యకుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments