అత‌ని వ‌ల్ల పాయ‌ల్ రాజ్‌పుత్‌ మోసపోయిందా? ఎవరతను? (video)

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2022 (16:08 IST)
Payal Rajput,
సినిమా ఇండ‌స్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఎవ‌రూ లేకపోతే ఇక్క‌డ చాలామంది మిస్‌గైడ్ చేస్తారు. అలా చేయ‌డం వ‌ల్ల చాలామంది మోస‌పోయి కెరీర్‌ను నాశ‌నం చేసుకున్న హీరోలు, హీరోయిన్లు వున్నారు. మొహానికి మేక‌ప్ వేసుకోగానే రంగుల ప్ర‌పంచంలో ఏదో తెలీని విజ‌యాన్ని సాధిస్తున్నామ‌నే ఫీలింగ్ క‌లుగుతుంది. ఒక్కోసారి ఓవర్‌నైట్ స్టార్ కూడా అయిపోవ‌చ్చు.


అలా కొంత‌మంది అయ్యారుకూడా. అటువంటి కోవ‌లోనే పాయ‌ల్ రాజ్‌పుత్ చేరింది. ఒక్క సినిమాతోనే ఎంతో పాపుల‌ర్ అయి పారితోషికం బాగా వ‌స్తున్న టైంలో ఓ వ్య‌క్తి వ‌ల్ల ఆమె రాంగ్‌ట్రాక్‌లోకి వెళ్ళి కెరీర్‌ను వెన‌కంజ‌ప‌డేలా చేసింది. ఇందుకు కార‌ణం గురించి ఆమె త‌న మ‌న‌సులోని బాధ‌ను ఇలా వ్య‌క్తం చేసింది.

 
ఆర్‌.ఎక్స్‌-100 సినిమాతో నేను ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిపోయాను. నా కెరీర్‌ను మార్చేసింది. సినిమా చేస్తున్న‌ప్పుడు హిట్ అవుతుంద‌ని అనుకోలేదు. ఆ సినిమా రిలీజ్ రోజు హైద‌రాబాద్‌లోని థియేట‌ర్‌లో మార్నింగ్ షో11గంట‌ల‌కు వెళితే థియేట‌ర్లో రెస్పాన్స్ చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. ఆ త‌ర్వాత కెరీర్ సాఫీగా సాగుతుంది అనుకున్నాను. కానీ దాన్ని మెయింటెన్ చేయ‌లేక‌పోవ‌డ‌మే పెద్ద స‌మ‌స్య‌గా మారింది. కొంత‌మంది న‌న్ను రాంగ్‌వేలో తీసుకెళ్ళారు.


ముఖ్యంగా నా మేనేజ‌ర్ న‌న్ను త‌ప్పుదోవ ప‌ట్టించారు. డ‌బ్బుల కోసం వాళ్ళు ఇష్టంవ‌చ్చిన‌ట్లు సినిమాల‌కు డ‌బ్బులు తీసేసుకున్నారు.  మా అమ్మ‌, నాన్న‌ల‌కు ఈ రంగంలో పెద్ద‌గా అనుభ‌వంలేదు. అందుకే నేను మేనేజ‌ర్‌ను, కొంత‌మంది మాట‌లు న‌మ్మి నేను చాలా న‌ష్ట‌పోయాను.


ఓవ‌ర్‌నైట్ స్టార్ అయ్యాక నా కెరీర్ వెన‌క‌గుడువేయ‌డానికి ఇదే పెద్ద కార‌ణం. ఆ టైంలో ముంబైలో నేను రెంట్ క‌ట్టేందుకు డ‌బ్బులుకూడా సంపాదించుకోలేక‌పోయాను. ఇదంతా ముగ్గురు వ్య‌క్తులు వ‌ల్ల నేను న‌ష్ట‌పోయాను. జీవితం ఒకేసారి పాఠం నేర్పుతుంది. అది నేను ఆర్‌.ఎక్స్‌. 100 త‌ర్వాత పెద్ద పాఠం నేర్చుకున్నాను. అంటూ మేనేజర్లు ఏ విధంగా మోసం చేస్తారో వివ‌రించింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

శ్రీవారి ప్రసాదం ధర పెంపు? క్లారిటీ ఇచ్చిన తితిదే చైర్మన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments