Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఠాగూర్
గురువారం, 3 ఏప్రియల్ 2025 (11:00 IST)
చిత్రపరిశ్రమపై సినీ హీరోయిల్ పాయల్ రాజ్‌పూత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్రపరిశ్రమలో బంధుప్రీతి, వివక్ష కొనసాగుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతిభకంటే బంధుప్రీతికే అవకాశాలు ఇస్తున్నారని వాపోయారు. ఇండస్ట్రీలో పేరున్న కుటుంబాల నుంచి వచ్చిన వారికే అవకాశాలు దక్కుతున్నాయని, టాలెంట్ ఉన్నా సరైన గుర్తింపు లభించడం లేదని ఆమె ఆరోపించారు. 
 
ఆధిపత్య ధోరణలు ఎక్కువగా ఉండే చిత్రపరిశ్రమలో నా శ్రమ, అంకితభావం నిజంగా ఫలితాన్నిస్తాయా అని ప్రశ్నించుకున్నపుడు ఏమో అనే సందేహం కలుగుతుంది. బాగా పేరుప్రఖ్యాతలు కలిగిన ఇంటిపేర్లు కలిగివారికి, సమర్థులైన ఏజెంట్లు ఉన్నవారికి అవకాశాలు వెళ్లడాన్ని గమనించాను. 
 
నా ప్రతిభతో నేను ఇక్కడకు నెగ్గుకురాగలనా అని ఆలోచిస్తుంటాను. అందుకే నటులుగా ఉండటం కంటే కఠినమైన కేరీర్ మొరకి ఉండదేమో ప్రతి రోజూ అనిశ్చితే. ఎందుకంటే ఇక్కడ బంధుప్రీతి, పక్షపాతం అనే అంశాలు ప్రతిభను తెరమరుగు చేస్తుంటాయి అని పాయల్ రాజ్‌పుత్ అన్నారు. 
 
కాగా, 'ఆర్ఎక్స్ 100' అనే చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమె చేసిన ట్వీట్ ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వల్లభనేని వంశీకి షాక్ - అలా బెయిల్ ఎలా ఇస్తారంటూ సుప్రీం ప్రశ్న?

Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments