Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముదురు హీరో సరసన 'ఆర్ఎక్స్ 100' హీరోయిన్

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (13:22 IST)
'ఆర్ఎక్స్ 100' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్‌లో అద్భుతంగా నటించింది. ఆ తర్వాత ఈ భామకు మూవీ ఆఫర్లు వరుసబెట్టాయి. కానీ, ఆమె మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. 
 
ఈ క్రమంలో టాలీవుడ్ ముదురు హీరోగా గుర్తింపు పొందిన విక్టరీ వెంకటేష్ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ వెంకీమామ. ఈ చిత్రంలో రాశీ ఖన్నాను ఒక హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఇపుడు మరో హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్‌ను సెలెక్ట్ చేశారు. 
 
బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. వెంకీ .. చైతూ కాంబినేషన్లో కొన్ని సరదా సన్నివేశాలను చిత్రీకరించారు. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగులో రాశి ఖన్నా జాయిన్ కాగా, తాజాగా పాయల్ రాజ్ పుత్ కూడా చేరింది. ఇదే అంశంపై పాయల్ ఓ ట్వీట్ చేసింది. 'వెంకీమామ' షూటింగులో పాల్గొన్నాను .. చాలా ఎగ్జైటింగ్ గా వుంది' అంటూ పేర్కొంది. 
 
ఈ సినిమాలో చైతూ జోడీగా రాశి ఖన్నా నటిస్తుండగా .. వెంకటేశ్ సరసన నాయికగా పాయల్ కనిపించనుంది. కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాపై దర్శకుడు బాబీ పూర్తి నమ్మకంతో ఉన్నాడు. 'ఎఫ్ 2' తర్వాత వెంకటేశ్ నుంచి వస్తోన్న మరో వినోదభరిత చిత్రం కావడంతో, అభిమానుల్లోను అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమ వివాహం, భర్తకు అనుమానం, భర్త సోదరి హత్య చేసింది

Jagan: ఆ మనిషి కార్పొరేటర్‌కి ఎక్కువ-ఎమ్మెల్యేకి తక్కువ: జగన్ ఫైర్ (video)

Ram Gopal Varma -కమ్మ రాజ్యంలో కడప రెడ్లు : వర్మకు సీఐడీ అధికారుల సమన్లు

గర్ల్స్ లిక్కర్ పార్టీ: రాత్రంతా మద్యం సేవించి తెల్లారేసరికి శవమైంది

వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఎల్ఓపీ హోదా మంజూరు చేయలేం.. స్పీకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

తర్వాతి కథనం
Show comments