Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళవారం మూవీలో పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూస్తే షాక్ అవుతారు : అజయ్ భూపతి

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (17:37 IST)
Payal Rajput
'ఆర్ఎక్స్ 100', 'మహా సముద్రం' చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా 'మంగళవారం'. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు దర్శక, నిర్మాతలు ప్రకటించారు.
 
చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ''గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ 'మంగళవారం'. సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ఎవరు మంచి? ఎవరు చెడు? అనేది కనిపెట్టలేని విధంగా కథనం ముందుకు వెళుతుంది. క్యారెక్టర్స్ మీద బేస్ చేసుకుని తీసిన సినిమా. పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూస్తే షాక్ అవుతారు. థియేటర్లలో ప్రేక్షకులకు డిఫరెంట్ థ్రిల్ అందించే సినిమా ఇది. నవంబర్ 17న థియేటర్లలో 'మంగళవారం' విడుదల అవుతుంది'' అని అన్నారు.  
 
నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం మాట్లాడుతూ ''అజయ్ భూపతి 'ఆర్ఎక్స్ 100'లో తెలుగులో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు 'మంగళవారం'తో కూడా సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తారు. ఇదొక డిఫరెంట్ అటెంప్ట్. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ ట్రై చేయని విధంగా ఆయన సినిమా తీశారు. నవంబర్ 17న థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఆ మాటే చెబుతారు. 99 రోజులు షూటింగ్ చేశాం. అందులో 51 రోజులు రాత్రివేళల్లో చిత్రీకరణ చేశాం. మేం ఉన్నత సాంకేతిక విలువలతో నిర్మించాం. హేమాహేమీలైన సాంకేతిక నిపుణులు సినిమాకు పని చేస్తున్నారు. 'కాంతార'తో పాపులరైన అజనీష్ లోక్‌నాథ్ ఎక్స్‌ట్రాడినరీ మ్యూజిక్ ఇస్తున్నారు. 'విక్రమ్ వేద', 'కాంతార', 'విక్రాంత్ రోణ', 'సలార్' తదితర చిత్రాలకు పని చేసిన, 'రంగస్థలం'తో నేషనల్ అవార్డు అందుకున్న ఎంఆర్ రాజా కృష్ణన్ మా 'మంగళవారం' చిత్రానికి సౌండ్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. త్వరలో ట్రైలర్ విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని అన్నారు.  
 
'మంగళవారం' చిత్రానికి అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి చిత్రాన్ని నిర్మిస్తోంది. 
 
పాయల్ రాజ్‌పుత్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర, మ్యూజిక్ : 'కాంతార' ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్, ఎడిటర్ : మాధవ్ కుమార్ గుళ్ళపల్లి, మాటలు : తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్, ఆర్ట్ డైరెక్టర్ : మోహన్ తాళ్లూరి, ప్రొడక్షన్ డిజైనర్ : రఘు కులకర్ణి,  ఫైట్ మాస్టర్స్ : రియల్ సతీష్, పృథ్వీ, సౌండ్ డిజైనర్ & ఆడియోగ్రఫీ : 'నేషనల్ అవార్డ్ విన్నర్' రాజా కృష్ణన్, కొరియోగ్రఫీ : భాను, కాస్ట్యూమ్ డిజైనర్ : ముదాసర్ మొహ్మద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయికుమార్ యాదవిల్లి, పీఆర్వో : పులగం చిన్నారాయణ, డిజిటల్ మార్కెటింగ్ : టాక్ స్కూప్, నిర్మాతలు : స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : అజయ్ భూపతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 శాతం వేతనం డిమాండ్ చేస్తే 22.5 శాతం పెంచారు : కార్మిక శాఖ కమిషన్

5.5 కోట్ల మంది వీసాలను సమీక్షిస్తాం : అమెరికా ప్రకటన

అటెండెన్స్ మినహాయింపు.. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అందరికీ రెండు లడ్డూలు ఇచ్చారు.. నాకు ఒక్కటే ఇచ్చారు.. సీఎం హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు.. ఎక్కడ?

ప్రియురాలితో జరిగిన గొడవ: ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments