Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దర్శకుడు నీలి చిత్రాలు చూపించాడు... క్రికెటర్‌తో డేటింగ్ చేశా... పాయల్ ఘోష్

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (09:07 IST)
బాలీవుడ్, శాండిల్‌వుడ్ చిత్రపరిశ్రమలను డ్రగ్స్ వ్యవహారం ఓ కుదుపు కుదుపుతోంది. హిందీలో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, కన్నడంలో రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలు డ్రగ్స్ దందాలో ఇప్పటికే అరెస్టు అయివున్నారు. అయితే, ఈ వ్యవహారంల ఇలా ఉంటే.. సినీ నటి పాయల్ ఘోష్ ఇపుడు సంచలన ఆరోపణలు చేశారు. ఈఆర్డీ రోడ్డులో ఉండే ఓ డైరెక్టర్ తనను గదిలోకి తీసుకెళ్ళి నీలి చిత్రాలు చూపించాడని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
నిజానికి సినీ ఇండస్ట్రీలో ఉండే చాలా మంది సినీ ప్రముఖులు, వారి పిల్లలు మాదకద్రవ్యాలను వాడుతుంటారనే ప్రచారం ఉంది. అందుకే వారంతా చలాకీగా ఉంటారని చెబుతుంటారు. అయితే, ఈ డ్రగ్స్ వినియోగంతో పాటు.. క్యాస్టింగ్ కౌచ్ అంశాలపై నటి పాయల్ ఘోష్ స్పందిస్తూ, తాను కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. 
 
ఓ డైరెక్టర్ ఈఆర్డీ రోడ్‌లో కలిసిన వేళ, గదిలోకి తీసుకెళ్లి, నీలి చిత్రాన్ని చూపించాడని, తాను ఏ హీరోయిన్‌ను కలిసినా, ఇక్కడే ఎంజాయ్ చేస్తానని అతను చెప్పగా, తనకు ఒంట్లో బాగాలేదని చెప్పి తప్పించుకున్నానని వ్యాఖ్యానించింది. ఆపై మరే ఇతర డైరెక్టర్ నుంచి తనకు ఇదే విధమైన అనుభవం ఎదురు కాలేదని చెప్పుకొచ్చింది. 
 
ఇకపోతే, డ్రగ్స్ ప్రస్తావన వస్తే, తాను దూరంగా ఉంటానని చెప్పింది. సుశాంత్ కొన్ని సంవత్సరాలుగా తనకు తెలుసునని, అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడని భావించడం లేదని తెలిపింది. గతంలో ఓ క్రికెటర్‌తో డేటింగ్ చేశానని, అతనితో బ్రేకప్‌తో తీవ్ర మానసిక వేధన అనుభవించానని, సుదీర్ఘకాలం పాటు చికిత్స తర్వాత కోలుకున్నానని వ్యాఖ్యానించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments