Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పుట్టుకను నా తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోయారు : రేణూ దేశాయ్

రేణూ దేశాయ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య. దర్శకురాలు కూడా. ఈమె మహిళా దినోత్సవం రోజున ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమా రంగానికి రాకముందు.. అంటే ఓ ఆడపిల్లగా, సినీ రంగంలోకి వచ్చాక ఓ హీరోయిన్‌గ

Webdunia
గురువారం, 9 మార్చి 2017 (11:58 IST)
రేణూ దేశాయ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య. దర్శకురాలు కూడా. ఈమె మహిళా దినోత్సవం రోజున ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమా రంగానికి రాకముందు.. అంటే ఓ ఆడపిల్లగా, సినీ రంగంలోకి వచ్చాక ఓ హీరోయిన్‌గా, ఓ ఇంటికి ఇల్లాలిగా అనేక బాధలు పడినట్టు తెలిపింది. ముఖ్యంగా... ఓ బాలికగా తన ఇంట్లోనే ఎదుర్కొన్న వివక్షతను తెలిపేలా ఈ వ్యాఖ్యలు చేసింది. చిన్నప్పుడు తాను చాలా కష్టాలు ఎదుర్కొన్నానని, ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉండడానికి కారణం తన పట్టుదల, కృషేనని, తనకు అండగా ఏ ఒక్కరూ లేరంటూ పేర్కొంది. 
 
రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే... ‘మా అక్క తర్వాత ఓ మగబిడ్డ పుడతాడని మా అమ్మానాన్న ఎదురుచూశారు. కానీ, నేను పుట్టేసరికి వారు నిరుత్సాహంలో కూరుకుపోయారు. నా పుట్టుకను వారు జీర్ణించుకోలేకపోయారు. రెండో బిడ్డ కూడా ఆడపిల్లే అని తెలియడంతో మా నాన్న మూడు రోజుల వరకు ఆస్పత్రికి రాలేదని గుర్తు చేసింది. 
 
అంతేకాదు... మా సొంతింట్లోనే మా అక్క, నేను ఎంతో వివక్షతను ఎదుర్కొన్నాం. మా తమ్ముడిని మా పేరెంట్స్‌ దేవుడిలా చూసేవారు. మేం ఎంత చిన్న తప్పు చేసినా దండించే అమ్మానాన్న వాడిని మాత్రం ఏమీ అనేవారు కాదు. ఒకసారి ఈ వివక్షతను గురించి ప్రశ్నించినందకు మా అమ్మ చేత దెబ్బలు తిన్నా. అందుకే టీనేజ్‌లోకి వచ్చాక నేను టామ్‌బాయ్‌లా మారపోయాన’ని ఆమె చెప్పుకొచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర : ఎండీ సజ్జనార్ వెల్లడి

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments