Webdunia - Bharat's app for daily news and videos

Install App

"వకీల్ సాబ్‌"కు సెన్సార్ సభ్యుల ప్రశంసలు!! - 'యూఏ' సర్టిఫికేట్

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (18:30 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం "వకీల్ సాబ్". వేణూ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌పంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కాబోతోంది.
 
దాదాపు 3 సంవత్సరాల గ్యాప్‌ తర్వాత పవన్‌ కల్యాణ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలున్నాయి. అలాగే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌.. ఓ రేంజ్‌లో ఉండటంతో.. పవన్‌ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ పక్కా అనేలా అప్పుడే ఇండస్ట్రీ అంతా చర్చలు నడుస్తున్నాయి.
 
తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయినట్లుగా చిత్రయూనిట్ అఫీషియల్‌గా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. సెన్సార్‌ నుంచి యుబైఏ సర్టిఫికెట్‌ అందుకున్న ఈ చిత్రం.. ఏప్రిల్‌ 9న థియేటర్లలోకి వచ్చేందుకు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అలాగే సెన్సార్‌ సభ్యులు కూడా ఈ చిత్రం రూపొందిన తీరుపై ప్రత్యేక అభినందనలు తెలిపినట్లుగా తెలుస్తుంది. 
 
154 నిమిషాల నిడివి గల ఈ సినిమాలో పవన్‌ ఎంట్రీ, కోర్టు సీన్లు.. సినిమాకి హైలెట్‌గా ఉన్నాయని, "పింక్"‌, "నెర్కొండ పార్వై"‌లోని మెయిన్‌ కథాంశాన్ని మార్చకుండా.. సరికొత్తగా 'వకీల్‌ సాబ్‌'ని వేణు శ్రీరామ్‌ చిత్రీకరించినట్లుగా సెన్సార్‌ వర్గాల ద్వారా తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి

తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది : ప్రధాని నరేంద్ర మోడీ

మీరు కోట్లాది మందికి మార్గదర్శకుడిగా ఉండాలి : ఇట్లు.. మీ తమ్ముడు

థ్యాంక్యూ చిన్నన్నయ్యా.. మీరిచ్చిన పుస్తకమే రాజకీయ చైతన్యం కలిగించింది : పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments