Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' చిత్రం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న చిత్రం (ప్రొడక్షన్ నంబర్ 4) చిత్రం ఈరోజు ఉదయం 10 గంటల 49 నిమిషాలకు హైదరాబాద్ లోని రామానాయుడు స్థ

Webdunia
శనివారం, 5 నవంబరు 2016 (19:02 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న చిత్రం (ప్రొడక్షన్ నంబర్ 4) చిత్రం ఈరోజు ఉదయం 10 గంటల 49 నిమిషాలకు హైదరాబాద్ లోని రామానాయుడు స్థూడియోలో వైభవంగా ప్రారంభం అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్,నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నిర్మాత శరత్ మరార్, సూర్యదేవర నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో నిర్మిస్తున్న ఈ చిత్రం 'తమ సంస్థకు ఎంతో ప్రతిష్టాత్మకమైనదని తెలిపారు. డిసెంబర్‌లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉంటారు. వీరితో పాటు ఇతర ప్రముఖ తారాగణం ఎంపిక కాగానే త్వరలో ప్రకటించటం జరుగుతుంది.
 
ఈ చిత్రం ద్వారా సౌత్ ఇండియాలో పాపులర్ సంగీత దర్శకుడు 'అనిరుద్ రవిచందర్' సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఇండియాలో టాప్ మోస్ట్ కెమెరామెన్ వి. మణికందన్ (మణిరత్నం 'రావణ్', శంకర్ 'అపరిచితుడు', బాలీవుడ్ చిత్రాలు 'ఏ జవానీ హై దీవాని', మైహూనా) ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. కళా దర్శకత్వం: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: చంటి (కోటగిరి వెంకటేశ్వరరావు), ఎగ్జి క్యూటివ్ నిర్మాత: పి.డి.వి. ప్రసాద్. సమర్పణ: శ్రీమతి 'మమత', నిర్మాత: ఎస్.రాధాకృష్ణ (చినబాబు), రచన-దర్శకత్వం: త్రివిక్రమ్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh Meets PM: ఢిల్లీలో ప్రధానిని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ

Duvvada Srinivas: దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ నిశ్చితార్థం.. ఉంగరాలు తొడిగారుగా! (video)

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments