Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి - చెర్రీలకు పవన్ ఫీవర్ + టెన్షన్.. ఈ ఫ్యాన్స్‌ నోరుమూయించేదెలా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈనెల 11వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. దీనికంటే ముందుగా అంటే ఈనెల 7వ తేదీన గుంటూరులో ప్రీరిలీజ్ ఫంక్షన్ వేడుక జరుగనుంది. ఈ వేడుక వేదిక విషయంల

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (05:58 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈనెల 11వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. దీనికంటే ముందుగా అంటే ఈనెల 7వ తేదీన గుంటూరులో ప్రీరిలీజ్ ఫంక్షన్ వేడుక జరుగనుంది. ఈ వేడుక వేదిక విషయంలో ఇప్పటికే పలు చిక్కులను నిర్మాత ఎదుర్కొన్నారు. 
 
మరోవైపు ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తన బాబాయ్, మెగా ఫ్యామిలీ హీరో పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. పైగా పలువురు విమర్శలు కూడా చేశారు. చెర్రీ వ్యాఖ్యలు మరింత వేడిని పెంచేలా ఉండటంతో స్వయంగా హీరో చిరంజీవినే రంగంలోకి దిగి తన తనయుడిని మందలించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ఈనెల 7వ తేదీన జరిగే ప్రీరిలీజ్ కార్యక్రమానికి పవన్‌ కళ్యాణ్ వస్తాడా రాడా? అనే టెన్షన్ చిరంజీవి, చెర్రీలకు పట్టుకుంది. పవన్‌ రాకపోతే అభిమానులు ఊరుకోరు. పవన్‌ పేరుతో నినాదాలు చేసి మాట్లాడేవారికి చిరాకు తెప్పిస్తారు. పవన్‌ రాని ఫంక్షన్లకు హాజరైన చిరు, చరణ్‌, బన్నీ, వరుణ్‌ తేజ్‌.. అందరూ ఈ సమస్యను గతంలో ఎదుర్కొన్నవారే.
 
ఈ విషయం గురించి ఇప్పటికే పవన్ ఫ్యాన్స్‌కు నాగబాబు, బన్నీ క్లాస్‌ తీసుకున్నప్పటికీ వారిలో మార్పు రాలేదు. ఒకవేళ ఈ ఫంక్షన్‌కు పవన్‌ హాజరుకాకుంటే ఆ సమస్య మళ్లీ ఎదురవుతుంది. అందుకే ముందు జాగ్రత్తగా అభిమానులను ప్రిపేర్‌ చేయడానికే అరవింద్‌, చరణ్‌లు పవన్‌ రాడనే సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. 
 
పవన్‌ దేశంలో ఉంటే ఆ ఫంక్షన్‌కు తప్పకుండా వస్తాడని, కానీ, ఆయనకు ఆ సమయానికి బిజీ షెడ్యూల్స్‌ ఉన్నాయని అరవింద్‌ వివరణ ఇచ్చాడు. చరణ్‌ అయితే మరికాస్త ఘాటుగా స్పందించాడు. 'బాబాయ్‌కు ఇన్విటేషన్‌ ఇవ్వడం నా బాధ్యత. ఆయనేం చిన్నపిల్లాడు కాదు. రావాలో, వద్దో ఆయనే నిర్ణయించుకుంటార'ని అన్నారు. ఇపుడు ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఫలితంగా చిరంజీవి టెన్షన్‌లో నలిగిపోతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీకి పొంచివున్న మరో తుఫాను.. 23న అల్పపీడనం

సామాన్య భక్తుడిలా నేలపై పడుకున్న టీడీడీ బోర్డు సభ్యుడు... (Video)

సినీ నటి నవనీత్ కౌర్‌పై దాడికియత్నం ... 45 మంది అరెస్టు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments