Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ సినిమాలో నటించనున్న పవన్ కల్యాణ్.. ఆ సినిమా రీమేక్ అవుతుందట!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం పూర్తిస్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టారు. అజ్ఞాతవాసితో సినిమాలకు గుడ్ బై చెప్పేసిన పవన్ కల్యాణ్... ప్రస్తుతం తమిళ సినిమాలో నటించనున్నారని తెలిసింది. పవన్‌కల్యాణ్, త్రి

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (14:00 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం పూర్తిస్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టారు. అజ్ఞాతవాసితో సినిమాలకు గుడ్ బై చెప్పేసిన పవన్ కల్యాణ్... ప్రస్తుతం తమిళ సినిమాలో నటించనున్నారని తెలిసింది.


పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ''అత్తారింటికి దారేది'' బ్లాక్‌బ్లాస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పవన్ కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అత్తారింటికి దారేది మూవీని తెరకెక్కించేందుకు సిద్ధమైనట్లు ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించింది. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్ర నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నుంచి రీమేక్ హక్కులను కూడా కొనుగోలు చేసినట్లు లైకా ప్రొడక్షన్స్ వెల్లడించింది. 
 
ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన కోలమావు కోకిల సినిమాకు నిర్మాణ సారథ్యం వహించింది. ఈ చిత్రం ఆగస్టు 17వ తేదీన రిలీజ్ కానుంది. ఇదే నిర్మాణ సంస్థపై సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో సీక్వెల్ కూడా తెరకెక్కింది. ఈ చిత్రం నవంబర్ 29వ తేదీన విడుదల అవుతుందని టాక్. ఈ రెండు సినిమాలకు చెందిన పనులన్నీ పూర్తయ్యాక లైకా ప్రొడక్షన్స్ అత్తారింటికి దారేది సినిమాను రీమేక్ చేయనుందని సమాచారం. 
 
ఇక ఈ చిత్రంలో గౌతమ్ నందగా పవన్‌కల్యాణ్ పోషించిన పాత్రను తమిళంలో ఏ స్టార్ హీరో చేస్తాడో చూడాలి. లేకుంటే పవనే ఆ రోల్‌లో కనిపిస్తాడా.. అనేది తెలియాల్సి వుంది. అజిత్ లేదా విజయ్ ఈ సినిమాలో నటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments