Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సర్దార్ పాపారాయుడు'తో నాడు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ... నేడు 'సర్దార్'తో ఏపీ పొలిటిక్స్‌లో పవర్ స్టార్ కీ రోల్...?

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (17:28 IST)
పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తాజా చిత్రానికి 'సర్దార్‌' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేయడంతో పాటు ఆ చిత్రం కోసం ప్రత్యేకంగా గెడ్డం కూడా బాగా పెంచిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ స్టార్ట్ అయింది. గెడ్డంతో కనిపించిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా నున్నగా షేవ్ చేసుకుని నటించడం మొదలెట్టారు. ఐతే ఈ చిత్రంలో పవన్‌ గడ్డంతో నటించే ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాలు ఉన్నాయని తెలుస్తోంది. వాటిని షూటింగ్‌ చివరి షెడ్యూల్‌లో చిత్రీకరిస్తారని సమాచారం.
 
సర్దార్ గెటప్పులో పవన్ కళ్యాణ్ గుబురు గెడ్డంతో కనిపించడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఒక్కప్పుడు సీనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన 'సర్దార్‌ పాపారాయుడు'కు ఈ గెటప్పు దగ్గరగా ఉందని అంటున్నారు. అప్పుడు ఎన్టీఆర్‌ 'సర్దార్‌ పాపారాయుడు' చిత్రం ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చేముందు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే ఇప్పటి పవన్ కళ్యాణ్ సర్దార్ చిత్రం కూడా పవన్‌ పూర్తిస్థాయి రాజకీయాల వైపు అడుగులు పడేలా చేస్తుందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం రగులుతున్న ఏపీ, సర్దార్ ఏమైనా సాధించుకొస్తాడేమో వెయిట్ అండ్ సీ.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments