Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అన్నయ్య'తో మిస్.. 'తమ్ముడు'తో ఛాన్స్ ... : పవర్ స్టార్‌తో 'ఫిదా' భామ!! (video)

Pawan Kalyan
Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (09:39 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం "వకీల్ సాబ్". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇది పూర్తయిన తర్వాత పవన్ మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియమ్" అనే చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో పవన్ పక్కన కథానాయిక పాత్రకు సాయిపల్లవి పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంతుందనేది త్వరలో వెల్లడవుతుంది.
 
ఇదిలావుంచితే, ప్రస్తుతం నాగ చైతన్యకు జోడీగా 'లవ్ స్టోరీ' చిత్రంలోనూ, 'విరాటపర్వం' చిత్రంలో రానా సరసన, 'శ్యామ్ సింగ రాయ్'లో నాని పక్కన ప్రస్తుతం సాయిపల్లవి నటిస్తూ బిజీగా ఉంది. అంతేకాకుండా, మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో కూడా చెల్లి పాత్రను చేయనుందనే ప్రచారం జోరుగా సాగింది. కానీ, ఆ ఛాన్స్‌ను సాయి పల్లవి కోల్పోగా, మలయాళ భామ కీర్తి సురేష్ కొట్టేసింది. అయితే పవర్ స్టార్ సరసన నటించే లక్కీ ఛాన్స్‌ను సాయి పల్లవి కొట్టేసింది. 
 
నిజానికి సాయిపల్లవి ఇమేజ్ వేరు. మిగతా హీరోయిన్లకు ఆమెకు ఏమాత్రం పోలిక ఉండదు. గ్లామరస్ పాత్రలు అస్సలు చేయదు. ప్రాధాన్యత వున్న పాత్రలే తన హోమ్లీ లుక్‌తో చేస్తుంటుంది. అందుకే, ఈ ముద్దుగుమ్మకు ఇంతవరకు స్టార్స్‌తో నటించే ఛాన్స్ రాలేదు. అలాంటి సాయిపల్లవి ఇపుడు పవన్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకోవడం గమనార్హం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments