Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌గాడ్రా బుజ్జి - ఇండ‌స్ట్రీ స‌ర్వేరిపోర్ట్‌

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (19:40 IST)
Pawan Kalyan,ph
ఇటీవ‌ల తెలుగు సినిమా రంగంలో హాట్ టాపిక్‌గా మారిన అంశం ప‌వ‌న్‌క‌ళ్యాణ్. రిప‌బ్లిక్ ప్రీరిలీజ్‌నాడు ఆయ‌న మాట్లాడిన మాట‌లు తూటాలుగా ఎ.పి. మంత్రుల‌కు తాకాయి. దీనిపై ఆరుగురు మంత్రులు స్పందించ‌డం అనేది మామూలు విష‌యం కాదు. ఏమీతెలియ‌ని వ్య‌క్తి అయితే అంత‌మంది రియాక్ట్ అవ్వాల్సిన అవ‌స‌రంలేదు.

ప‌వ‌న్ మాట్ల‌లో నిజం చాలా వుంద‌ని సినీ విశ్లేష‌కులు తెలియ‌జేస్తున్నారు. ఆన్‌లైన్ టిక్క‌ెట్ల గురించి ఆయ‌న మాట్లాడుతూ, మేం క‌ష్ట‌ప‌డి చమ‌టోడ్చి, దెబ్బ‌లు తగిలించుకుని సంపాదించిన డ‌బ్బును ప్ర‌శ్నించే హ‌క్కు ప్ర‌భుత్వానికి ఎందుకు అంటూ నిల‌దీశారు. మేం క‌రెక్ట్‌గా టాక్స్ క‌డుతున్నాం. అనే మాట‌ల‌కు సినీ ప‌రిశ్ర‌మ‌లోని పెద్ద‌లంతా వ‌త్తాసుప‌లికారు. 
 
ప‌వ‌న్ మాట‌లు ప‌ట్టించుకోన‌వ‌స‌రంలేదంటే ఎ.పి. ప్ర‌భుత్వం ఎందుకు అంత‌లా రియాక్ట్ అవుతుంది. అదేవిధంగా వ‌ప‌న్ చెప్పిన ఆన్‌లైన్ టికెట్ల విష‌యం రాగానే మ‌రుస‌టి రోజే తెలుగు ఫిలింఛాంబ‌ర్ ఆప్ కామ‌ర్స్ ఓ లెట‌ర్ విడుద‌ల‌ చేసింది. ప‌వ‌న్ మాట‌లు వ్యక్తిగ‌తం. మేం మాత్రం ఎ.పి. ప్ర‌భుత్వానికి ఏమైతే మాట ఇచ్చామో దానికి క‌ట్టుబ‌డి వున్నామంటూ సారాంశంతో కూడిన లెట‌ర్ విడుద‌ల చేసింది.
 
ప‌వ‌న్ అన్న‌మాట్ల‌లో... కేవ‌లం నిర్మాత‌లంటే దిల్‌రాజు, అర‌వింద్‌, ఏషియ‌న్ సునీల్‌కాదు. చాలామంది చిన్న నిర్మాత‌లు వున్నారంటూ వివ‌రించారు. ఈ పాయింట్‌ను మీడియాకానీ, ఎ.పి. ప్ర‌భుత్వంకానీ హైలైట్ చేయ‌లేక‌పోయింది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఆన్‌లైన్ టికెట్ల అమ్మ‌కం కానీ అమ‌లు జ‌రిగితే ముందుముందు చిన్న నిర్మాత‌ల‌కు గుది బండ‌లా మారుతుంది.

భ‌విష్య‌త్‌తో చిన్న నిర్మాత‌లు సినిమాలు తీయ‌డానికి ముందుకు రార‌ని ప‌లువురు చిన్న నిర్మాత‌లు వాపోతున్నారు. కాబ‌ట్టి మా దృష్టిలో ప‌వ‌న్ మ‌గాడు అంటూ పేర్కొంటున్నారు. త‌మ‌ను ఇన్నాళ్ళు సినీ స‌మ‌స్య‌ల‌పై మాట్లాడితే పెద్ద‌లు నొక్కిపెట్టార‌నీ, అందుకే ప‌లుసార్లు ఛాంబ‌ర్ ముందు ధ‌ర్నా కూడా చేశామ‌ని గుర్తుచేసుకున్నారు చిన్న నిర్మాత‌లు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments