పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా `హరిహర వీరమల్లు` చిత్రం షూటింగ్ బీజీలో ఉన్నారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. జాగర్తమూడి రాధా కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారంనాడు ఈ చిత్రంకోసం వేసిన సెట్లో తీసిన యాక్షన్ సన్నివేశాన్ని ఓసారి పవన్ తిలకించారు.
ఈ వర్కింగ్ స్టిల్‌ను దర్శకుడు కృష్ జాగర్లమూడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో లో పవన్ కళ్యాణ్ ఇంటెన్స్ షాక్‌కి సంబంధించిన సన్నివేశాన్ని తదేకంగా పరిశీలిస్తున్నారు.కెమెరామెన్ జ్ఞాన శేఖర్, దర్శకుడు క్రిష్ కూడా ఈ షాట్‌నుచూస్తున్నారు. ఈ షాట్‌కు పవన్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.